Friday, May 1, 2026 06:54 AM
Friday, May 1, 2026 06:54 AM

వారందరి లెక్కలు తెలుస్తాను.. రష్మిక హెచ్చరిక

ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఆడియో వివాదం నేపథ్యంలో నటి రష్మిక మందన్నా తీవ్రంగా స్పందించారు. తనపై గత కొన్నేళ్లుగా జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కఠిన హెచ్చరిక జారీ చేశారు.

రష్మిక మాట్లాడుతూ, గత 8 సంవత్సరాలుగా తనపై కొందరు ఉద్దేశపూర్వకంగా అసత్య కథనాలు ప్రచారం చేస్తూ తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని పేర్కొన్నారు. తాను ఎప్పుడూ ఉపయోగించని పదాలతో, తాను చెప్పని విషయాలతో కొన్ని కథనాలు సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రచారం తనను మానసికంగా చాలా బాధపెట్టిందని, అయినప్పటికీ ఇప్పటివరకు ఎంతో సహనంతో స్పందించకుండా ఉన్నానని తెలిపారు.

Also Read : విజయ్ దళపతికి అమెజాన్ బిగ్ షాక్..!

అయితే ఇటీవల 8 సంవత్సరాల క్రితం జరిగిన ఒక ప్రైవేట్ ఫోన్ సంభాషణను సోషల్ మీడియాలో లీక్ చేసి తనపై తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నారని ఆమె అన్నారు. ఇది తన వ్యక్తిగత గోప్యతపై తీవ్రమైన దాడి అని పేర్కొంటూ, ఇకపై ఈ విషయాన్ని మౌనంగా చూడలేనని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్లు మరియు సంబంధిత వ్యక్తులు రాబోయే 24 గంటల్లో ఆ పోస్టులను తొలగించాలని రష్మిక హెచ్చరించారు. లేదంటే వారిపై న్యాయపరమైన కఠిన చర్యలు తీసుకుంటానని ఆమె తెలిపారు. “నా జీవితం ఎలా ఉండాలో ఇతరులు నిర్ణయించలేరు. ప్రతి ఒక్కరి జీవితాన్ని వారు స్వయంగా నిర్వహించుకోవాలి” అని ఆమె పేర్కొన్నారు.

ఈ వివాదానికి కారణమైన అంశం ఏమిటంటే, గతంలో రష్మిక కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో ప్రేమలో ఉండి నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆ నిశ్చితార్థం తర్వాత రద్దు అయ్యింది. ఇటీవల నిశ్చితార్థం జరిగిన కాలంలో రష్మిక మరియు రక్షిత్ శెట్టి తల్లి మధ్య జరిగినట్లు చెప్పబడుతున్న ఒక ఫోన్ సంభాషణ ఆడియో సోషల్ మీడియాలో లీక్ కావడంతో అది వైరల్ అయింది. ఆ ఆడియో పూర్తిగా కన్నడ భాషలో ఉండటం వల్ల అందరికీ స్పష్టంగా అర్థం కావడం లేదు. అయితే ఆ సంభాషణలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు వినిపిస్తున్నదని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

Also Read : ఎక్కడ చూసిన నీ ఫోటోలే.. తాత ఎవరే నువ్వు..?

ఈ ఆడియో లీక్ కారణంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు మొదలవడంతో, దీనిపై రష్మిక మందన్నా స్పందిస్తూ తన వైఖరిని స్పష్టంగా తెలియజేశారు. ప్రస్తుతం ఈ వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అబార్షన్ చట్టంపై సుప్రీంకోర్టు...

14 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్...

ఏపీ బ్రాండ్‌కి సచిన్‌...

నారా లోకేశ్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు చూడటానికి...

తల్లికి వందనం అప్పుడే.....

2026-27 విద్యా సంవత్సరం నేపథ్యంలో కూటమి...

మరో పార్టీ నేతను...

రాజకీయాల్లో ఇప్పుడు విపరీత ధోరణి కనిపిస్తోంది....

టెన్త్ ఫలితాల్లో లోకేష్...

ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్...

చేసిన పాపం.. కార్యకర్తల...

వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా మాజీ ఇన్ఛార్జ్...

పోల్స్