Thursday, September 17, 2026 08:11 PM
Thursday, September 17, 2026 08:11 PM

కనపడితే పేల్చేస్తాం.. ప్రపంచం రెడీగా ఉండాలి..!

ఇరాన్ – ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం ఇప్పుడు తారా స్థాయికి చేరుకుంది. ఆయుధ యుద్ధం క్రమంగా ఆయుధ యుద్ధంగా మారిన నేపధ్యంలో చమురు రవాణా విషయంలో ఇప్పుడు భయాలు పెరుగుతున్నాయి. ఇరాన్ పదే పదే దాడులకు దిగడంతో చమురు రవాణా ఆగిపోయింది. హార్మోజ్ జల సంధి నుంచి రవాణా ఆగిపోయింది. అమెరికా, ఇజ్రాయిల్ దేశాలతో పాటుగా ఆ దేశాలకు అనుకూలంగా ఉండే నౌకలను పెల్చేస్తాం అంటూ ఇరాన్ వార్నింగ్ ఇవ్వడంతో పలు దేశాల నౌకలు సాహసం చేయడం లేదు.

Also Read : ఏపీ అభివృద్ధికి అడ్డుగోడ వైఎస్ జగన్

ఇక తాజాగా ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తమ బలగాలు నౌకలపై కూడా దాడులు చేస్తున్నాయని, దీనితో చమురు ధర బ్యారెల్ కు 200 డాలర్లకు పైగానే ఉండే అవకాశం ఉందని, దీనికి ప్రపంచం సిద్దంగా ఉండాలని స్పష్టం చేసింది. 1970ల తర్వాత అత్యంత దారుణమైన చమురు పరిస్థితిగా నిపుణులు చెప్తున్నారు. ఈ నేపధ్యంలో అంతర్జాతీయ ఇంధన సంస్థ అలెర్ట్ అయింది. అటు ఇరాన్ లోని ఆయిల్ డిపో లను ఇజ్రాయిల్ టార్గెట్ చేయగా, ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ రిఫైనరీలపై దాడులు చేసింది.

Also Read : ముహుర్తం ఖరారు.. మార్చి 23న శంకుస్థాపన

బుధవారం, గల్ఫ్ జలాల్లో మూడు నౌకలను తమ బలగాలు అడ్డుకున్నాయని, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఓ ప్రకటనలో తెలిపింది. గల్ఫ్‌లోని తమ ఆదేశాలను ధిక్కరించిన ఓడలపై కాల్పులు జరిపామని తెలిపింది. ఇప్పటికే 125 డాలర్లకు చమురు ధర పెరిగిన నేపధ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన మొదలైంది. సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, బహ్రెయిన్ సహా పలు దేశాల్లో ఇప్పటికే ఉత్పత్తి ఆగిపోయింది. దీనితో అమెరికాపై ఆయా దేశాలు క్రమంగా ఒత్తిడి పెంచుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్