కారుణ్య మరణం” దీనిపై దేశ వ్యాప్తంగా ఎన్నో చర్చలు జరుగుతూ ఉంటాయి. కోలుకోలేని వారిని పోషించడం, వారికి వైద్యం చేయడం కుటుంబాలకు ఎంతో భారంగా ఉంటుంది. అలాంటి వారికి కారుణ్య మరణం మినహా మరో మార్గం లేదు. కాని మన దేశంలో దీనికి నిబంధనలు ఎక్కువ. కారుణ్య మరణం కోసం ఎదురు చూసే వారు ఎందరో మన దేశంలో. అలాంటి వారికి తాజాగా సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు ఆశ కలిగించింది. ఓ ప్రమాదంలో గాయపడి.. 13 ఏళ్ళ నుంచి చికిత్స పొందుతున్నాడు ఓ యువకుడు.
Also Read : తిరువూరుకు కొత్త బాస్.. తెరపైకి కొత్త పేరు..!
2013లో ప్రమాదానికి గురై.. నాటి నుంచి అంటే 13 ఏళ్ళుగా అతను చికిత్స పొందుతూనే ఉన్నాడు. వెంటిలేటర్ మీద అతనికి చికిత్స అందిస్తున్నారు. అయితే అతను కోలుకునే అవకాశం లేదని వైద్యులు, తల్లి తండ్రులు తేల్చడంతో, ఏళ్ళ తరబడి సాగుతున్న పిటీషన్ పై సుప్రీం కోర్ట్ నేడు కీలక తీర్పు ఇచ్చింది. పంజాబ్ యూనివర్సిటీ విద్యార్థి హరీష్ రాణా 2013 లో పేయింగ్ గెస్ట్ వసతి గృహంలో నాల్గవ అంతస్తు నుండి పడి తీవ్ర గాయాల పాలయ్యాడు. అతనికి లైఫ్ సపోర్ట్ అమర్చారు.
Also Read : ఇరాన్ ఆయిల్ కు “గోల్డ్ లిక్విడ్” అనే బిరుదు ఎందుకు..?
అప్పటి నుండి, అతను శ్వాస తీసుకోవడానికి, ట్రాకియోస్టమీ ట్యూబ్, ఆహారం కోసం గ్యాస్ట్రోజెజునోస్టమీ ట్యూబ్ అమర్చారు. అప్పటి నుంచి మంచానికే పరిమితం అయ్యాడు. దీనిపై తల్లి తండ్రులు కోర్ట్ కు వెళ్ళగా నేడు.. జస్టిస్ జె.బి. పార్దివాలా, జస్టిస్ కె.వి. విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసనం తీర్పు వెల్లడించింది. రోగి తిరిగి కోలుకోవడానికి సాధ్యం కాదని వైద్యులు స్పష్టం చేయడంతో, అతను మరణించడానికి తాము అనుమతి ఇస్తున్నామని కోర్ట్ తెలిపింది. 2011లో అరుణ షాన్‌బాగ్ కేసులో దేశంలో అసాధారణ పరిస్థితులలో నిష్క్రియాత్మక కారుణ్య మరణాన్ని చట్టబద్ధం చేశారు.

