Thursday, March 12, 2026 01:30 AM
Thursday, March 12, 2026 01:30 AM

పెంచలయ్య సరే.. మరి.. రవి సంగతి ఏమిటీ..?

తిరుమల పరకామణిలో బంగారం, వెండి అపహరణకు యత్నించిన కేసు ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి పెంచలయ్య 100 గ్రాముల బంగారం అపహరణకు యత్నించి పట్టుబడగా, అతడి ఇంట్లో 555 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై సీఐడీ వేగంగా విచారణ జరుపుతోంది. అయితే పెంచలయ్య అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అని.. భారీ చోరీ అనే ప్రచారం అవాస్తవమని టీటీడీ క్లారిటీ ఇచ్చింది. ఇది ఒక ఉద్యోగి చేసిన చిన్న సంఘటన అంటూ టీటీడీ చెప్పుకొచ్చింది. పెంచలయ్య చోరీ ఘటనపై సీఐడీ, ఏసీబీ విచారణ జరుపుతున్నాయని, ఈ కేసు ప్రస్తుతం కోర్టు విచారణలో ఉందని టీటీడీ అధికారులు తెలిపారు.

Also Read : సరికొత్త వ్యూహం.. తీవ్రత పెంచిన ఇరాన్..!

అయితే పరకామణి చోరీ ఘటనను వైసీపీ నేతలు రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఈ విషయంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రులు కాకాణి గోవర్థన్ రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్ ఆఘమేఘాల మీద మీడియా ముందుకు వచ్చారు. పరకామణిలో పెద్ద ఎత్తున బంగారం చోరీ చేస్తున్నారని.. దీని వెనుక టీడీపీ నేతలున్నారని ఆరోపిస్తున్నారు. అసలు చంద్రబాబు అండతోనే పరకామణిలో చోరీ జరిగిందని కూడా వైసీపీ అధికారిక మీడియా సాక్షిలో స్పెషల్ స్టోరీ బోర్డు కూడా ప్రసారం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఆధ్వర్యంలో తిరుమల పవిత్రత ఘోరంగా దెబ్బ తీస్తున్నారని పదే పదే ఆరోపణలతో స్టోరీలు ప్రసారం చేస్తున్నారు.

శ్రీవారి పరకామణిలో ఎవరు చోరీ చేసినా అది ఘోర అపచారమే. దేవుడి సొమ్ము కాజేసేందుకు ఎవరు ప్రయత్నం చేసినా సరే.. అది తప్పే. మహా పాపం కూడా. కానీ కొందరు అక్రమార్కులు మాత్రం దేవుడి సొమ్ము కోసం కక్కుర్తి పడుతున్నారు. వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని కేసు నమోదు చేసి విచారిస్తోంది కూటమి సర్కార్. అయితే కూటమి సర్కార్‌లోనే పరకామణి చోరీ జరిగిందని ఆరోపిస్తున్న వైసీపీ నేతల తీరు గురివింద సామెతను గుర్తు చేస్తోంది. తన కింద ఉన్న నలుపు గురివిందకు తెలియదన్నట్లుగా వైసీపీ నేతలు ఇప్పుడు వ్యవహరిస్తున్నారు. మరి కొందరు వైసీపీ నేతలతో పాటు సాక్షి మీడియా కూడా.. అసలు హిందుత్వానికి తామే పేటెంట్ అన్నట్లుగా ఇప్పుడు కొత్త పలుకులు పలుకుతున్నారు.

Also Read : హోటల్స్ బంద్.. నిన్న బెంగళూరు, నేడు ముంబై, రేపు బెజవాడ..?

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ హోదాలో ఉన్న సమయంలో పరకామణిలో చోరీ చేసిన రవికుమార్ అనే వ్యక్తి ఏకంగా 900 డాలర్లు దొంగిలిస్తుండగా సీసీ కెమెరాకు చిక్కాడు. దీంతో అతని పై కేసు నమోదు చేసిన తర్వాత.. నాటి వైసీపీ నేతలు, టీటీడీ పెద్దలు రంగంలోకి దిగారు. రవికుమార్ చోరీ కేసును కోర్టులో రాజీ చేసుకున్నారు. రవికుమార్‌కు చెందిన రూ.14 కోట్ల విలువైన ఆస్తులను టీటీడీకి విరాళంగా ఇచ్చేలా వీలునామా రాయించారు. దీంతో రవికుమార్‌పై పెట్టిన కేసును టీటీడీ వెనక్కి తీసుకుంది. ఇదంతా కేవలం 2 నెలల వ్యవధిలోనే ఆఘమేఘాల మీద జరిగిపోయింది. ఈ కేసులో ఉన్నత స్థాయి కుట్ర కోణం ఉందేమోనని అనే అనుమానంతో సీఐడీ విచారణకు కూటమి సర్కార్ ఆదేశించింది. ఈ కేసు విచారణ సమయంలోనే.. ఈ కేసులో ఫిర్యాదుదారు, మాజీ ఏవీఎస్‌వో సతీష్ కుమార్ మృతదేహం రైలు పట్టాలపై అనుమానాస్పద స్థితిలో లభించడం కేసును మరింత క్లిష్టతరం చేసింది.

900 డాలర్లు చోరీ చేసిన రవికుమార్ నుంచి రూ.14 కోట్లు ఆస్తులు ఎందుకు తీసుకున్నారనే ప్రశ్నకు వైసీపీ నేతల దగ్గర జవాబు లేదు. అసలు పెద్ద జీయర్ మఠం గుమాస్తాకు పరకామణిలో ఎందుకు డ్యూటీ వేశారనే ప్రశ్నకు వైసీపీ నేతల దగ్గర నో ఆన్సర్. పరకామణి చోరీ కేసును 2 నెలల్లోనే ఎందుకు రాజీ చేయాల్సి వచ్చిందనే ప్రశ్నకు వైసీపీ నేతలు తెల్లమొహం వేస్తున్నారు. ఇప్పుడు పరకామణి చోరీ గురించి పెద్ద నీతి మాటలు చెబుతున్న మాజీ మంత్రి వెల్లంపల్లి.. ఆయన హయాంలో, ఆయన నియోజకవర్గంలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో వెండి సింహాల చోరీ కేసుతో పాటు అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలను దొంగచాటుగా అమ్ముకున్న కేసు గురించి అడిగితే మాత్రం.. నో కామెంట్ అనేస్తున్నారు.

Also Read : యుద్దాన్ని నువ్వు కాదు మేము శాసిస్తాం: ఇరాన్ వార్నింగ్

వీటితో పాటు ఇప్పుడు హిందుత్వానికి పేటెంట్ అని చెప్పుకుంటున్న వైసీపీ నేతలు.. జగన్ అధికారంలో ఉన్న సమయంలోనే అంతర్వేది రథం దగ్ధం, ఆంజనేయుని విగ్రహం ధ్వంసం, రామతీర్థంలో రాములోరి విగ్రహం ధ్వంసం, శ్రీకాళహస్తి ఆలయంలో అపచారం.. వీటన్నిటికి తోడు తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి.. ఇలా చెప్పుకుంటూ పోతే.. కోకొల్లలున్నాయి. వీటిపై అప్పట్లోనే హిందూ ధార్మిక సంఘాలు పెద్దె ఎత్తున ఆందోళన చేశాయి కూడా. వీటికి నాటి మంత్రి కొడాలి నాని చెప్పిన సమాధానం వైసీపీ నేతల తీరుకు అద్దం పడుతుంది కూడా. ఆంజనేయ స్వామి చెయ్యి ఇరిగితే ఏమవుతుంది.. కొత్త విగ్రహం వస్తుంది.. అంతే కదా.. వెండి విగ్రహాల చోరీతో మేడలు, మిద్దెలు కట్టేస్తారా.. అంటూ నాని చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి కూడా. నాడు జగన్ అధికారంలో ఉన్నప్పుడు హిందూ ఆలయాలపై జరిగిన దాడులు, తిరుమల పరకామణి చోరీ కేసులపై వైసీపీ నేతలు ఏ సమాధానం చెప్తారో చూడాలి మరి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సీఎం.. ముహూర్తం...

​బీహార్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్...

బ్రేకింగ్: పాదయాత్రకు సిద్దమవుతోన్న...

తెలంగాణలో భారత రాష్ట్ర సమితిని తిరిగి...

హైదరాబాద్ హాస్టల్స్ కష్టాలు.....

దేశ వ్యాప్తంగా ఎల్ పీ జీ...

రైతన్నలకు సిఎం చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో సిఎం చంద్రబాబు...

దానంకు క్లీన్ చిట్.....

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు...

ఏపీ క్యాబినెట్‌లో మార్పులు.....

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి...

పోల్స్