Tuesday, March 10, 2026 08:30 PM
Tuesday, March 10, 2026 08:30 PM

పవన్ మాట వినరేం..? ఇంకెన్నాళ్ళు ఈ జాగు..!

జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత పవన్ కళ్యాణ్.. మినహా, ఆ పార్టీ నాయకత్వం ఆ పార్టీని సీరియస్ గా తీసుకున్న పరిస్థితి నేటి వరకు లేదు అనే మాట వాస్తవం. 2024 లో అధికారంలోకి వచ్చిన సరే.. పార్టీ బలోపేతం విషయంలో పార్టీ నాయకత్వం ఏకతాటి మీద లేదు అనే మాట వినపడుతోంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోకుండా అధికారాన్ని ఎంజాయ్ చేసే పనిలో పార్టీ నాయకులు ఉన్నారు. 2014లో పార్టీ పెట్టిన తర్వాత నుంచి నేటి వరకు కూడా, క్షేత్రస్థాయిలో పార్టీకి బలమైన నాయకత్వం కనబడటం లేదు.

Also Read : లిక్కర్ కేసులో ఆ ఇద్దరే అంతా.. ఆస్తులు కొనేసారు..!

2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఇతర పార్టీలకు చెందిన ఒకరిద్దరు నాయకులు జనసేన పార్టీలో జాయిన్ అయినా సరే.. తర్వాత పరిస్థితి అనుకూలంగా లేదనే మాట వినపడుతోంది. ముఖ్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని, పార్టీ నాయకులు సీరియస్ గా, తీసుకోకపోవడం సరైన ప్రచారం కల్పించకపోవడం పట్ల.. అసంతృప్తి వ్యక్తం అవుతుంది. 2029 ఎన్నికల్లో మరిన్ని స్థానాల్లో పోటీ చేయాలి అంటే.. సభ్యత నమోదు వంటి కార్యక్రమాలను పార్టీ నాయకత్వం సీరియస్ గా తీసుకోవాలి.

Also Read : హోటల్స్ బంద్.. నిన్న బెంగళూరు, నేడు ముంబై, రేపు బెజవాడ..?

అలాగే అసెంబ్లీ సమావేశాల్లో కూడా నాయకులు బలంగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. కల్తీ లడ్డు విషయంలో కూడా వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కడా మాట్లాడే ప్రయత్నం చేయలేదు. నియోజకవర్గాల్లో కూడా ఏ కార్యక్రమాలు జరగడం లేదు. కనీసం పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న శాఖలపై కూడా వారి ప్రచారం లేదు. ఇవేవీ కూడా జనసేన పార్టీ నుంచి జరగడం లేదు.. అనే అసహనం పవన్ కళ్యాణ్ లో కనపడుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జనసేన పార్టీ ఆవిర్భావ సభను కూడా ఆ పార్టీ అధిష్టానం రద్దు చేసింది. ఇక పార్టీలో కీలక మార్పులకు కూడా పవన్ సిద్దమవుతున్నారు. ఇంచార్జ్ లను అవసరమైతే మార్చేసే యోచనలో కూడా పవన్ ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలకు కూడా ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో ఇలాగే ఉంటే సీటు కష్టమే అని పవన్ చెప్పినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరువూరుకు కొత్త బాస్.....

వరుసగా నాలుగు సార్లు పార్టీ ఓడిన...

ఏపీ పంచాయతీల్లో విప్లవాత్మక...

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీల వర్గీకరణ విధానంలో...

జగన్‌ తప్పు చేశాడా..?...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై...

లిక్కర్ కేసులో ఆ...

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో ఈడీ అధికారుల...

హోటల్స్ బంద్.. నిన్న...

ఇరాన్ – ఇజ్రాయిల్ యుద్ధం ప్రభావం...

యుద్దాన్ని నువ్వు కాదు...

ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం...

పోల్స్