Wednesday, March 4, 2026 08:46 PM
Wednesday, March 4, 2026 08:46 PM

ఆ సినిమాకు లైన్ క్లియర్.. అన్నీ వాయిదా..!

ధురంధర్ సినిమా.. పాకిస్తాన్‌లో భారత గూఢాచారి కదలికలు. 2025లో విడుదలైన ధురంధర్ మొదటి భాగం స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా ప్రేక్షకులను అలరించింది. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమాను రూ.280 కోట్లతో నిర్మిస్తే.. రిలీజ్ తర్వాతా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించింది. విడుదలైన 40 రోజులకే సినిమా ఏకంగా 12 వందల కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. రణవీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, మాధవన్‌, సారా అర్జున్ నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు రాబట్టింది.

Also Read : ఆ విషయంలో బతికిపోయిన అవినాష్..!

అండర్ కవర్ స్పైగా పాకిస్తాన్‌లోకి ప్రవేశించిన రణవీర్ సింగ్.. అక్కడ నుంచి భారత్‌కు ఎలా సమాచారం పంపారు.. ఉగ్రమూకల కుట్రలను ఎలా భగ్నం చేశారు.. అనే అంశంతోనే సినిమా నడుస్తోంది. సినిమా ఏకంగా మూడున్నర గంటల పాటు ఉంది. ఈ ఏడాది జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక్కడ కూడా టాప్‌లో ఉంది. దీంతో ధురందర్ 2పై ఇప్పుడు అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ధురందర్ 1 అన్ని బాషల్లో మంచి లాభాలు రాబట్టడంతో.. ఇప్పుడు అందరి దృష్టి ధురందర్ 2 కలెక్షన్‌పై పడింది. దీంతో ఈ సినిమాతో పోటీ పడేందుకు పెద్ద సినిమాలు మొగ్గు చూపడం లేదు.

Also Read : డేటాతో చేసిన దాడి: ఖచ్చితత్వంతో ఖమేనీ అంతం!

ధురందర్ 2 మార్చి 19న రిలీజ్ అవుతోంది. దీంతో అదే రోజు రిలీజ్ కావాల్సిన టాక్సిక్.. ఏకంగా జూన్ 4వ తేదీకి వాయిదా పడింది. కన్నడ స్టార్ యష్ హీరోగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక తెలుగు సినిమాలు కూడా ధురందర్‌ 2తో పోటీ పడేందుకు సిద్ధంగా లేవు. మార్చి 19న రిలీజ్ కావాల్సిన అడవి శేషు హీరోగా నటించిన డెకాయిట్ ఏప్రిల్ 10కి వాయిదా వేశారు. మార్చి 27న విడుదల రామ్ చరణ్ పెద్ది కూడా ఏప్రిల్ 30కి వాయిదా పడింది. మార్చి 26న విడుదల కావాల్సిన నాని ప్యారడైజ్ ఇప్పుడు ఏకంగా ఆగస్టు 21వ తేదీకి వాయిదా పడినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ నెలలో కేవలం ధురందర్ 2 మాత్రమే సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయనుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

నానీ యాక్టివ్ అవ్వడానికి...

2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైసీపీ...

ఈ చైర్మన్ మాకు...

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్...

మండలిలో వైసీపీ సభ్యుల...

దేవుడంటే మా కుటుంబానికి అపారమైన గౌరవం...

విజయవాడకు మరో మెగా...

కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత...

కార్యకర్త కొడుకు కోసం...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన...

ఆ విషయంలో బతికిపోయిన...

ఏపీలో ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగా...

పోల్స్