సినిమా వాళ్ళ పెళ్లిళ్లకు సందడి ఎక్కువ. విడాకులకు వేడుకలు ఎక్కువ.. నేటి రోజుల్లో జరుగుతోన్న తంతు ఇదే. గతంలో ఊళ్ళో పెళ్ళికి కుక్కలు.. కాలం మారక సోషల్ మీడియా హడావుడి ఎక్కువైన మాట వాస్తవం. ఇప్పుడు విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నల వివాహం విషయంలో జనాల హడావుడి చూస్తే.. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్న చందంగా ఉంది. వాళ్ళ బట్టల నుంచి పెళ్లి వేడుక.. చివరకు విమానాశ్రయంలో దిగడం వరకు ప్రతీ ఒక్కటి సోషల్ మీడియాలో హడావుడి చేసారు.
Also Read : ఇంత జరుగుతున్నా.. ఆయనెక్కడా..?
వంద శాటిలైట్ లను గగనతలంలోకి విజయవంతంగా పంపిన.. ఇస్రో శాస్త్రవేత్తలకు కూడా ఈ రేంజ్ పాపులారిటీ రాలేదు మరి. సరే గాని.. వాళ్ళ పెళ్లి ఖర్చు ఎంతో.. ఓ చిన్న లెక్క అంటూ మీడియాలో హడావుడి నడుస్తోంది. అసలు ఆ లేక్కపై ఓ లుక్కు వేద్దాం. లేక్ సిటీ ఉదయ్‌పూర్ లోని ఆరావళీ రేంజ్ లో.. ఐటీసీ వారి ‘ది మెమెంటోస్’ అనే లగ్జరీ రిసార్ట్ లో జరిగిన.. ఈ హడావుడి పెళ్లికి ఖర్చు చూస్తే మైండ్ బ్లాకే అంటున్నాయి సోషల్ మీడియా వర్గాలు. అందులో మొత్తం 117 గదులు, ప్రైవేట్ విల్లాలు ఉండగా.. నార్మల్ రూమ్స్ రేటు రోజుకు రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు చార్జ్ చేస్తారు.
Also Read : బీఆర్ఎస్, బిజెపిలకు బులెట్ దిగిందా..?
అదే ప్రైవేట్ విల్లాలు, స్పెషల్ సూట్స్ అయితే డైలీ.. 70 వేల రూపాయలు స్వైప్ చేయాల్సిందే. ఇక్కడ ఉండే ఇండోర్ బ్యాంకెట్ హాల్స్, పెద్దపెద్ద లాన్స్ లోనే పెళ్లిని అంగరంగ వైభవంగా చేస్తారట. పెళ్లి హడావుడి చూసి.. ఎన్నో వందల కోట్లు అయిందనుకున్నారు జనాలు.. కానీ, అనఅఫీషియల్ లెక్కల ప్రకారం.. రిసార్ట్, గెస్ట్‌ల లిస్ట్, ఈవెంట్ మేనేజ్‌మెంట్, డెకరేషన్, ఫుడ్ అన్నీ క్యాలుక్యులేటర్ లో కౌంట్ చేస్తే.. విజయ్-రష్మికల పెళ్లికి రూ.90 లక్షల నుంచి రూ.2.5 కోట్ల వరకు ఖర్చు మాత్రమే. స్పెషల్ పర్ఫార్మెన్సెస్, ఎక్స్‌ట్రా అరేంజ్మెంట్స్ గనుక చేస్తే ఖర్చు పెరిగే ఛాన్స్ ఉంది. ఎత్తిన విస్తరాకులు తక్కువే కాబట్టి.. బడ్జెట్ లిమిటెడ్ గానే ఉండవచ్చు అని టాక్.

