Tuesday, August 4, 2026 01:57 PM
Tuesday, August 4, 2026 01:57 PM

ప్రముఖ కంపెనీలో సగం మంది ఉద్యోగులు అవుట్..!

ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ట్విట్టర్ మాజీ సీఈఓ జాక్ డోర్సే నేతృత్వంలోని బ్లాక్ సంస్థ కూడా పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించింది. గురువారం 4,000 ఉద్యోగులను తమ సంస్థ నుంచి తొలగించింది. సంస్థ ఉద్యోగుల్లో ఇది దాదాపు 40 శాతం. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ను వినియోగించి తాము, మంచి ఫలితాలు సాధిస్తున్నామని డోర్సే పేర్కొన్నారు.

Also Read : బ్రేకింగ్ : పాక్ కు చుక్కలు చూపిస్తున్న ఆఫ్ఘన్ సైన్యం

తక్కువ టీం ద్వారా టూల్స్ వినియోగించి మంచి ఫలితాలు సాధిస్తున్నామని డోర్సే ఒక ప్రకటనలో తెలిపారు. ఎక్స్ లో దీనిపై ఆయన ఒక పోస్ట్ చేసారు. మా కంపెనీ చరిత్రలో అత్యంత కఠినమైన నిర్ణయాలలో ఒకటి తీసుకున్నానని తెలిపారు. తమ వ్యాపారం బలంగా ఉందని, లాభాలు పెరుగుతూనే ఉన్నామని పేర్కొన్నారు. మరింత ఎక్కువ మంది కస్టమర్లకు సేవలందిస్తూనే ఉన్నామన్నారు. తాము పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నామని, తాము వినియోగిస్తున్న సాంకేతికత మంచి ఫలితాలు ఇస్తోంది అన్నారు.

Also Read : పెద్దల సభ కు రేవంత్ స్టైల్ లాబీయింగ్

అప్పడప్పుడు చిన్న చిన్న ఉద్యోగులను తొలగించడం కంటే.. ఒక్కసారే భారీగా ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు. ఇక కంపెనీ షేర్లు ఈ నిర్ణయం తర్వాత దాదాపు 30 శాతం పెరిగాయి. తొలగించబడిన ఉద్యోగులకు.. తమ జీతం 20 వారాల పాటు తీసుకుంటారని ఆయన వెల్లడించారు. ఆరోగ్య భీమా ఆరు నెలల పాటు అందిస్తామని కూడా తెలిపారు. అలాగే 5 వేల డాలర్లు కూడా వారికి అందించనుంది సంస్థ. బ్లాక్‌ చెయిన్ టెక్నాలజీపై ఈ సంస్థ ఎక్కువగా పని చేస్తూ ఉంటుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

రోడ్డు ప్రమాదాలపై కేంద్రం...

దేశంలో నానాటికీ పెరిగిపోతున్న ఘోర రోడ్డు...

వైసిపి మాజీ ఎమ్మెల్యే...

శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

పోల్స్