Friday, June 19, 2026 11:34 AM
Friday, June 19, 2026 11:34 AM

భారత్ సెమీస్ చేరాలంటే ఈ లెక్కలే కీలకం..!

టి20 వరల్డ్ కప్ లో భాగంగా భారత జట్టుకు కష్ట కాలం నడుస్తోంది. జట్టుని ప్రకటించిన తర్వాత గాయాలు, ఆ తర్వాత లీగ్ దశలో కష్టంగా విజయాలు సాధించడం, ఆ తర్వాత సూపర్ 8 లో సఫారీలపై భారీ ఓటమి.. అన్నీ కూడా ఇబ్బందికరంగానే ఉన్నాయి. ఇక తాజాగా జింబాబ్వేపై మంచి విజయం సాధించినా.. భారత జట్టుకు ఇబ్బందులు తప్పేలా కనపడటం లేదు. ఇతర జట్ల విజయాలపై భారత్ ఆధారపడాల్సిన పరిస్తితి ఇప్పుడు ఏర్పడింది. మరి భారత్ సెమీస్ కు క్వాలిఫై కావాలంటే ఏం చేయాలో చూద్దాం.

Also Read : టఫ్ టైం.. అతను తుది జట్టులో ఉంటాడా..?

ఆదివారం ఈడెన్ గార్డెన్స్ లో వెస్టిండీస్‌ ను భారత్ ఓడిస్తే సెమీఫైనల్ కు అర్హత సాధిస్తారు. ఓడిపోతే మాత్రం ఇబ్బందులు తప్పవు. వెస్టిండీస్ గెలిస్తే మాత్రం.. సఫారీలు జింబాబ్వే మీద భారీ తేడాతో ఓడిపోతేనే భారత్ అర్హత సాధిస్తుంది. కానీ ఇక్కడ మరో కీలక విషయం ఏంటీ అంటే.. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే మాత్రం వెస్టిండీస్ జట్టు సెమీస్ కు వెళ్తుంది. కారణం నెట్ రన్ రేట్. అప్పుడు భారత్ కు విండీస్ కు 3 పాయింట్ లు ఉంటాయి. 4 పాయింట్లతో సఫారీలు సెమీస్ కు వెళ్తారు.

Also Read : నా భర్తను పరిచయం చేస్తున్నా: రష్మిక

ఇక నిన్న జరిగిన మ్యాచ్ లో భారత్ భారీ తేడాతో గెలిచినా విమర్శలు తప్పడం లేదు. ముఖ్యంగా శివం దూబేకి బౌలింగ్ ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. హార్దిక్ పాండ్యా, బూమ్రాకి రెండు ఓవర్లు మిగిలి ఉన్నాయి. అయినా సరే.. దూబేకి బౌలింగ్ ఇచ్చారు. అతను రెండు ఓవర్లలో మొత్తం 46 పరుగులు ఇచ్చాడు. ఇక ఫీల్డింగ్ లో కూడా అతను చురుకుగా కనపడలేదు. దీని కారణంగా నెట్ రన్ రేట్ ప్రభావితం అయింది. భారీ తేడాతో గెలిచినా ఇంకా మైనస్ లోనే రన్ రేట్ ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రఘురామ కేసుపై హైకోర్ట్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో...

ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం రవాణా...

ప్రజల్లోకి వెళ్ళాల్సిందే.. చంద్రబాబు...

ఏపీలో అధికారుల తీరుపై విమర్శలు వస్తున్న...

బ్రేకింగ్: లోకేష్ సంచలన...

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి...

పోల్స్