Thursday, September 17, 2026 08:10 PM
Thursday, September 17, 2026 08:10 PM

టఫ్ టైం.. అతను తుది జట్టులో ఉంటాడా..?

టి20 వరల్డ్ కప్ లో భారత్ కీలక మ్యాచ్ కు సిద్దమైంది. గురువారం చెన్నైలో జరిగే సూపర్ 8 మ్యాచ్‌లో జింబాబ్వేతో భారత్ తలపడుతుంది. దక్షిణాఫ్రికాతో భారీ ఓటమి తర్వాత భారత సెమీఫైనల్ అవకాశాలకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. వెస్టిండీస్ జింబాబ్వేను భారీ తేడాతో ఓడించడంతో పరిస్థితులు మరింత దిగజారాయి. ఫలితంగా, టాప్ 4లో స్థానం సంపాదించాలంటే భారత్ తమ రెండు మ్యాచ్‌ల్లోనూ భారీ తేడాతో గెలవాలి. జింబాబ్వే ఏ మాత్రం గట్టి పోటీ ఇచ్చినా సరే భారత్ కు అది దెబ్బే.

Also Read : పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ రెడీ చేస్తున్న డైరెక్టర్లు..!

రన్ రేట్ పైనే భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. దీనితో చెన్నై పిచ్ ఎంత వరకు భారత్ కు సహకరిస్తుందనే దానిపైనే చర్చ అంతా. అయితే వాతావరణం పరంగా ఈ రోజు మ్యాచ్ కు పూర్తి అనుకూలంగా ఉంది. వర్షం పడే అవకాశాలు కూడా లేవనే చెప్పాలి. ఇదిలా ఉండగా, జింబాబ్వేతో జరిగే సూపర్ 8 మ్యాచ్‌కు ముందు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ రింకు సింగ్ జట్టులో చేరనున్నట్లు భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ ధృవీకరించారు.

Also Read : సీఎంఓలో ఆ ఇద్దరు అవుట్..?

ప్రస్తుతం జరుగుతున్న టి 20 వరల్డ్ కప్ లో అన్ని మ్యాచ్ లు ఆడిన రింకూ సింగ్.. లివర్ క్యాన్సర్ తో బాధపడుతున్న తన తండ్రిని చూసేందుకు సొంత రాష్ట్రానికి వెళ్ళిన సంగతి తెలిసిందే. దీనితో అతను ఆడతాడా లేదా అనే దానిపై మాత్రం స్పష్టత రావడం లేదు. రింకూ ఫాం కూడా భారత్ కు ఆందోళన కలిగిస్తోంది. రింకు ఆడకపోతే అతని స్థానంలో కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కూడా జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్