Thursday, September 17, 2026 10:43 PM
Thursday, September 17, 2026 10:43 PM

డైవర్స్ గురించి సమంతా సంచలన కామెంట్స్..!

సమంతా” పర్సనల్ లైఫ్ వార్తలతో తెలుగులో ఇంత ఫేమస్ అయిన హీరోయిన్ మరొకరు ఉండరు. సినిమాలతో సగం పాపులారిటీ వస్తే.. నాగ చైతన్యతో పెళ్లి, విడాకులు, రెండవ పెళ్లి వ్యవహారాలూ ఆమెకు మరింత పాపులారిటీ తెచ్చిపెట్టాయి. నాగ చైతన్యతో విడాకుల తర్వాత రాజ్ నిడిమోరు డేటింగ్ చేసిన సమంతా.. గత ఏడాది డిసెంబర్‌ లో కోయంబత్తూరులో వివాహం చేసుకుంది. ఇక ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తన జీవితం గురించి పలు విషయాలు పంచుకుంది.

Also Read : మరో వివాదంలో మోహన్ బాబు యూనివర్సిటీ..!

తన భర్త లేకుండా తాను ఒక్క రోజు కూడా ఎక్కడికి వెళ్ళలేకపోతున్నా అని.. రాజ్ కూడా అలాగే ఉంటాడు అంటూ చెప్పుకొచ్చింది. తాము కలిసే పని చేస్తామని, కలిసే ఆడుకుంటాం అంటూ చెప్పుకొచ్చింది. అలాగే కలిసి జిమ్ కూడా చేస్తామని చెప్పుకొచ్చింది. తమకు అలా చేయడం ఇష్టం అని వివరించింది. ఇక విడాకుల తర్వాత తాను ప్రపంచం నుంచి ఏ విధంగా దూరమయ్యానో చెప్పుకొచ్చింది. తాను విడాకులు తీసుకున్న తర్వాత.. అందరికీ దూరంగా ఉండటం నేర్చుకున్నాను అని తెలిపింది.

Also Read : ఆఫ్ ది రికార్డు వార్తలు.. పార్ట్ 3..!

వేరొకరిపై ఆధారపడటం అనేది సాధ్యమవుతుందనే భావన తనకు లేదని పేర్కొంది. రాజ్ నిడమోరు చాలా మంచి వ్యక్తి అంటూ చెప్పుకొచ్చింది. ఇటీవల తన ఓల్డ్ ఫ్రెండ్ ని కలిసా అని చెప్పుకొచ్చిన సమంతా.. ఆ తర్వాత ఆమె ఒక వాయిస్ నోట్ పంపిందని.. “చాలా కాలం తర్వాత నువ్వు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడటం లేదని” ఆ వాయిస్ నోట్ లో ఉందని సమంతా గుర్తు చేసుకుంది. ఫ్యామిలి మెన్ సీరీస్ తో ఒక్కటైన సమంత, రాజ్ నిడమోరు.. దాదాపు మూడేళ్ళ డేటింగ్ తర్వాత వివాహం చేసుకున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్