ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాజకీయాల్లో.. ఎక్కువగా కనపడేది టీడీపీ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం. 2014 నుంచి దీని తీవ్రత ఎక్కువగా కనపడిన మాట వాస్తవం. ఓటుకు నోటు, నదీ జలాల వ్యవహారం సహా పలు అంశాల్లో రెండు పార్టీల మధ్య యుద్ద వాతావరణం నడిచింది. ఇక 2023 లో చంద్రబాబు అరెస్ట్ పరిణామం కూడా ఈ రెండు పార్టీల మధ్య యుద్దాన్ని వేరే లెవల్ కు తీసుకుని వెళ్ళింది. అవకాశం దొరికితే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉంటారు. తాజాగా మంత్రి వాసంశెట్టి శుభాష్ సంచలన కామెంట్స్ చేసారు.
Also Read : నాటకాల రాయుళ్లది రోజుకో రాజకీయం
కేసీఆర్ హయాంలో బీసీలకు అన్యాయం జరిగిందని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఏపీలోకి రావాలని చూస్తే తన్ని తరిమేస్తాం అంటూ హెచ్చరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం గంగలకుర్రులో శెట్టిబలిజ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీసీ సామాజిక వర్గాలను ఓసీల్లో చేర్చి, వారి భవిష్యత్తును నాశనం చేశారు అని మండిపడ్డారు. శెట్టిబలిజ కులానికి జరిగిన అన్యాయాన్ని ప్రస్తావిస్తూ కేసీఆర్ నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేసారు.
Also Read : బ్రేకింగ్: గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి లోకేష్..!
రాష్ట్రాలు విడిపోయినంత మాత్రాన కులాలను విడదీసే అవసరం లేదు అని స్పష్టం చేసారు. గతంలో కేసీఆర్ ను తిడితే హైదరాబాద్ రా చూసుకుందాం అన్నారు… హైదరాబాద్ వెళ్తే నన్నేం చేయలేకపోయారని, హైదరాబాదులో బీసీలను ఓసీలో చేర్చడంపై ఢిల్లీ స్థాయిలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. బిఆర్ఎస్ అంటూ ఆంధ్ర రాష్ట్రంలోకి రావాలని చూస్తే కాలు కూడా పెట్టనీయమని హెచ్చరించారు. కెసిఆర్ కానీ ,కేటీఆర్ గానీ ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెడితే తన్ని తరిమేస్తామన్నారు.

