Friday, June 19, 2026 08:36 AM
Friday, June 19, 2026 08:36 AM

బరువు తగ్గే వాళ్ళు ప్రోటీన్ ఎప్పుడు తీసుకోవాలి..?

బరువు తగ్గే వాళ్లకు ప్రోటీన్ ఆహారం అనేది అత్యంత కీలకం. కార్బ్స్ తక్కువగా తీసుకునే సమయంలో ప్రోటీన్ కు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. కండరాలు బలోపేతం కోసం.. మాక్రోన్యూట్రియెంట్ ప్రోటీన్ అనేది చాలా ముఖ్యం. కణజాలాల పెరుగుదలకు మరమ్మత్తుకు ప్రోటీన్ ప్రాథమిక ఆహారం. జీవక్రియ, మానసిక స్థితి, వివిధ శారీరక ప్రక్రియలను నియంత్రించే హార్మోన్ల ఉత్పత్తికి ఇది చాలా అవసరం. కొవ్వులు, కార్బోహైడ్రేట్ల కంటే ప్రోటీన్ అధిక థర్మిక్ ప్రభావాన్ని కలిగి ఉండటం వలన బరువు మెయింటేన్ చేయడానికి హెల్ప్ అవుతుంది.

Also Read : పయ్యావుల విశ్వరూపం.. హాట్ హాట్ గా మండలి..!

శరీరం ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది. తగినంత ప్రోటీన్ తీసుకోవడం బలమైన రోగనిరోధక వ్యవస్థకు చాలా అవసరం. ఇతర వ్యాధులను, ఇన్ఫెక్షన్లను కంట్రోల్ చేయడానికి కూడా ప్రోటీన్ ముఖ్యం. అయితే అది ఎప్పుడు తినాలో చాలా మందికి తెలియని విషయం. ప్రోటీన్ వినియోగానికి సరైన సమయం మన రోజు వారీ కార్యకలాపాలపై ఆధారపడి ఉంటుంది. బరువు తగ్గే వాళ్ళు అయితే.. భోజనానికి – భోజనానికి మధ్యలో ప్రోటీన్ అధికంగా ఉండే స్నాక్స్ తినడం మంచిది.

Also Read : భారత్ పై ట్రంప్ మరోసారి సంచలన కామెంట్..!

దీని కారణం కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆకలిని కంట్రోల్ చేయడంలో ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. వ్యాయామం తర్వాత 30 నిమిషాల నుండి 2 గంటలలోపు ప్రోటీన్ తీసుకోవడం వల్ల కండరాలు బలపడే అవకాశం ఉంటుంది. దీనిని అనాబాలిక్ విండో అని పిలుస్తారు. ఈ టైం లో కండరాలు ముఖ్యంగా పోషకాలను గ్రహిస్తాయి. నిద్రపోయే ముందు ప్రోటీన్ అధికంగా ఉండే చిరుతిండిని తింటే.. కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది. నెమ్మదిగా జీర్ణమయ్యే కేసైన్ ప్రోటీన్ తినాల్సి ఉంటుంది. లీన్ మాంసాలు, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, చిక్కుళ్ళు, గింజలు మరియు విత్తనాలను తినడం మంచిది. చాలా మందికి ఉదయం పూట ప్రోటీన్ లోపం ఉంటుంది. అధిక ప్రోటీన్ కలిగిన అల్పాహారానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఆకలిని కంట్రోల్ చేసుకోవడం, రోజు మొత్తం శక్తి ఉంటుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రఘురామ కేసుపై హైకోర్ట్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో...

ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం రవాణా...

ప్రజల్లోకి వెళ్ళాల్సిందే.. చంద్రబాబు...

ఏపీలో అధికారుల తీరుపై విమర్శలు వస్తున్న...

బ్రేకింగ్: లోకేష్ సంచలన...

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుర్చీలో...

భయపడాల్సిన వారేమో భయపెడుతున్నారు.. భయపెట్టాల్సిన వారేమో...

పోల్స్