Tuesday, July 7, 2026 06:44 AM
Tuesday, July 7, 2026 06:44 AM

భారత్ – పాక్ మ్యాచ్ ఆదాయం ఎన్ని వేల కోట్లు అంటే..?

భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అనగానే క్రికెట్ ప్రపంచంలో ఉండే క్రేజ్ వేరు. అందుకే ఆదాయం కూడా భారీగా ఉండే మాట వాస్తవం. ఇప్పుడు రెండు దేశాల మధ్య మరోసారి టి20 వరల్డ్ కప్ రూపంలో ఓ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ద్వారా కూడా క్రికెట్ బోర్డులకు, ఐసీసీకి భారీ ఆదాయం సమకూరింది. నిన్న జరిగిన మ్యాచ్ ద్వారా.. వాణిజ్య పరంగా.. దాదాపు రూ. 1,800 కోట్ల నుంచి రూ. 2,200 కోట్ల వరకు ఉంటుందని అంచనా. భారత క్రికెట్ నియంత్రణ మండలికి కూడా భారీగా ఆదాయం సమకూరుతుంది.

Also Read : భారత్‌కు శివరాత్రి.. పాకిస్తాన్‌కు కాళరాత్రి..!

భారత క్రికెట్ బోర్డు.. ప్రపంచ క్రికెట్ ఆదాయంలో 70 శాతానికి పైగా అర్జిస్తుంది. గత నాలుగేళ్ల కాలంలో భారత్ – వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ల కారణంగా ఐసీసీకి 20 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. 2024 నుంచి 2027 వరకు ఈ ఆదాయం మరింత పెరిగే అవకాశం కనపడుతోంది. ఈ ఆదాయ వాటాలో దాదాపు 40 శాతం బిసిసిఐ సంపాదించనుంది. 2024-27 లో ఐసీసీ ఆదాయంలో బీసీసీఐ వాటా 38.50 శాతంగా ఉంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్ ల మొత్తం కంటే ఎక్కువ.

Also Read : గేట్స్ రాకతో ఏపీకి గ్లోబల్ అటెన్షన్

మరోవైపు, ఐసిసి ఆదాయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) వాటా 5.75 శాతం, అంటే వారికి దాదాపు రూ. 310 కోట్ల రూపాయల ఆదాయం రానుంది. అందుకే ఈ మ్యాచ్ నిర్వహణ విషయంలో ఐసీసీ అంతపట్టుబట్టింది. అటు సంయుక్త వేదికల్లో మ్యాచ్ లు నిర్వహించడంతో ఆయా దేశాల క్రికెట్ బోర్డు లకు కూడా భారీ ఆదాయం వస్తుంది. కాగా నిన్న జరిగిన మ్యాచ్ లో పాక్ ఓటమి పాలైంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ప్రభుత్వ లాయర్ల వైఫల్యమేనా..?...

ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్...

నాడు లేవని నోళ్ళు...

గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో...

రేవంత్ క్యాంపు ఆఫీసుల...

తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య పెద్ద...

యూట్యూబర్ రావణ్.. ఇప్పట్లో...

ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్...

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు...

ఏపీలో ఖాళీ కానున్న గవర్నర్ కోటా...

కవిత కొత్త పార్టీకి...

కల్వకుంట్ల కవిత ఇటీవలే ప్రతిపాదించిన నూతన...

పోల్స్