Saturday, February 14, 2026 09:13 PM
Saturday, February 14, 2026 09:13 PM

పవన్ ను ఎందుకు వాడుకోలేదు..? బీజేపీ కేడర్ ఫైర్..!

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలోపేతం అవుతుందని ఎప్పటినుంచో ఆ పార్టీ నాయకులు చెబుతూనే ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ కొంత ప్రభావం చూపించింది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా 8 ఎంపీ స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్ పార్టీతో పాటుగా భారత రాష్ట్ర సమితికి కూడా సవాల్ చేసింది. 2018 నుంచి 2023 వరకు ఆ పార్టీ క్షేత్రస్థాయిలో కొంత బలోపేతమైన సంకేతాలు కనిపించాయి. నిజామాబాద్ జిల్లాతో పాటుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా పార్టీ బలోపేతం అవుతుందని అంచనా వేశారు ఆ పార్టీ కార్యకర్తలు. అయితే పరిస్థితులు మాత్రం అనుకున్న విధంగా కనపడటం లేదు.

Also Read : అధినేతపై గుర్రుగా క్యాడర్.. అసలున్నాడా..!

సార్వత్రిక ఎన్నికలు వచ్చినప్పుడు మినహా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం ఆయన సంకేతాలు ఏ దిశగా కూడా లేవనే చెప్పాలి. జూబ్లీహిల్స్, ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపించలేదు. దీనితో తెలంగాణలో బిజెపి బలోపేతం కావాలి అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఫార్ములా అమలు చేయాలని ఆ పార్టీ.. కార్యకర్తలు కోరుతున్నారు. తెలుగుదేశం పార్టీతో పాటుగా జనసేన పార్టీతో కూడా కలిసి మున్సిపల్ ఎన్నికలకు వెళ్లి ఉంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటుగా నల్గొండ, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఎంతోకొంత పార్టీ ప్రభావం చూపించి ఉండేదని అంచనా వేస్తున్నారు.

Also Read : లోకేష్ కు జనసైనికులు జై.. ఎందుకలా..?

జనసేన పార్టీని ఆఖరి నిమిషంలో తప్పించి పోటీ చేయించడం కూడా మైనస్ అయిందనే అభిప్రాయాలు ఉన్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి పార్టీ బలోపేతం కావాలంటే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నుంచి పార్టీని మరింత దూకుడుగా ముందుకు నడిపించాలని.. పార్టీ ఎంపీలు మాటలకే పరిమితం కాకుండా పార్టీని బలోపేతం చేయడం పై దృష్టి సారిస్తే బాగుంటుందని ఆ పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు. తెలుగుదేశం పార్టీకి బలం ఉన్నప్పుడు తెలంగాణలో ఎందుకు వాడుకోలేకపోయారని సోషల్ మీడియాలో సైతం ప్రశ్నలు వినపడుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ప్రచారం చేసి ఉన్న బిజెపికి ఎంతో కొంత కలిసి వచ్చేదనే భావన కూడా వ్యక్తం అవుతుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏపీ బడ్జెట్ విశేషాలు.....

ఆంధ్రప్రదేశ్ శాసన సభలో రాష్ట్ర ఆర్ధిక...

అధినేతపై గుర్రుగా క్యాడర్.....

పార్టీ అధ్యక్షుడు ఎక్కడా..? అసలు ఆయన...

లోకేష్ కు జనసైనికులు...

నేటి రాజకీయాల్లో మాటకు మాట సమాధానం...

అంబటి దెబ్బ.. ఆ...

వైసీపీ నేతల్లో కలవరం మొదలైంది. మాజీ...

విజయవాడకు మెగా ప్రాజెక్టులు..!

కూటమి సర్కార్ ‌అధికారంలోకి వచ్చిన తర్వాత...

‘–40’ మార్కులతో వైద్య...

ఒకప్పుడు వైద్యుడు కావడం అంటే అత్యంత...

పోల్స్