Friday, February 13, 2026 11:06 AM
Friday, February 13, 2026 11:06 AM

టీడీపీ డెల్టా, పల్నాడు టైగర్లు ఎక్కడ..?

వైసీపీ నాయకులు నేరుగా చంద్రబాబు, లోకేష్ పై వ్యక్తిగత విమర్శలు, బూతులతో రెచ్చిపోతుంటే టిడిపిలో ఉన్న సీనియర్ నాయకుల వైఖరి పై పార్టీలో భిన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒకరేమో డెల్టా టైగర్ అంటారు.. ఇంకొకరేమో పల్నాడు టైగర్ అంటారు.. కానీ ఈ పులులన్నీ ఇప్పుడు ఎక్కడా..? ఇదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో వినిపిస్తున్న ప్రశ్న. వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు బూతుల వ్యవహారం టీడీపీలో పెద్ద దుమారం రేపుతోంది. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు నోటికొచ్చినట్లు బూతులు తిట్టారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలుగు తమ్ముళ్లు అంబటిపై ఫైర్ అయ్యారు.

ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అంబటిపై 40 వరకు కేసులు నమోదు చేశారు. అంబటిని పోలీసుల అరెస్టు చేసి రిమాండ్‌కు పంపగా.. కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక అంబటికి ఏదో అన్యాయం జరిగిపోయిందని.. కాపు నేతపై చంద్రబాబు కక్ష సాధిస్తున్నారంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెద్ద ర్యాలీ చేసి మరీ విమర్శలు చేశారు. జగన్ విమర్శలకు టీడీపీ నేతల తరఫున ఎవరు స్పందించారనే విషయం ఇప్పుడు పార్టీలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. చంద్రబాబుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యల తర్వాత ఆయన ఇంటి దగ్గర నిరసన వ్యక్తం చేసిన నేతలెవరు అని పార్టీ పెద్దలు ఆరా తీస్తున్నారు.

Also Read : టాలీవుడ్‌లో కొత్త వ్యక్తులు.. పెత్తనానికి బ్రేక్..!

ఇలా ధర్నాలు, ఆందోళన చేసిన వారిలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో పులులు అని చెప్పుకునే ఒక్కనేత కూడా కనిపించటం లేదంట. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన బీసీ మహిళ గళ్లా మాధవి, ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎస్సీ నేత రామాంజనేయులుతో పాటు బీసీ, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతలు, కార్యకర్తలు మాత్రమే ఉన్నట్లు పార్టీ పెద్దలకు తెలిసింది. నిజానికి ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన నేతలంతా గుంటూరులో లేదా హైదరాబాద్‌లో ఉంటారు. డెల్టా టైగర్ అని చెప్పుకునే ఆలపాటి రాజేంద్రప్రసాద్, ధూళ్లిపాళ్ల నరేంద్ర, పల్నాడు టైగర్ అనిపించుకునే యరపతినేని శ్రీనివాస్, మేమే పార్టీ.. మాదే పార్టీ అని గొప్పగా చెప్పుకునే ప్రత్తిపాటి పుల్లారావు, భాష్యం ప్రవీణ్ వంటి కమ్మ సామాజికవర్గం నేతలంతా గుంటూరులోనే ఎక్కువగా ఉంటారు.

ఇంకా చెప్పాలంటే.. అంబటి బూతులతో రెచ్చిపోయిన రోజున వీరంతా పెన్షన్ పంపిణీ కోసం తమ తమ నియోజకవర్గాల్లో ఉన్నారు. అయితే ఘటన జరిగిన రోజు సాయంత్రానికి దాదాపుగా అందరూ గుంటూరు చేరుకున్నారని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి పార్టీ అధినేత చంద్రబాబుకు నివేదిక చేరినట్లు తెలుస్తోంది. అయితే వీళ్లల్లో కనీసం ఒక్కరు కూడా ఆ రోజు ఇంటి నుంచి రోడ్ల మీదకు రాలేదని.. అధినేతను బూతులు తిట్టినా కూడా.. కనీసం వీరికి చీమ కూడా కుట్టినట్లు వ్యవహరించలేదని అధినేతకు అందిన నివేదికలో స్పష్టంగా ఉన్నట్లు సమాచారం.

Also Read : లోకేష్ డిన్నర్ మీట్.. మంత్రి గారి కొత్త సాంప్రదాయం..!

అంబటి నివాసం దగ్గరకు ఆఘమేఘాల మీద వచ్చిన వారంతా బీసీ కార్యకర్తలతో పాటు దళిత దండోరా వర్గానికి చెందిన వాళ్లే ఉన్నారని స్పష్టమవుతోంది. గుంటూరు సిటీలో ఉన్న సీనియర్ నేతలంతా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారనే విషయం ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. వీరిలో ఆలపాటి, ప్రత్తిపాటి మంత్రిపదవులు కూడా అనుభవించారు. యరపతినేని, దూళ్లిపాళ్ల పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. పదవులు కావాలి కాని.. పార్టీకి, కార్యకర్తలకు అండగా ఎందుకు ఉండటం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రశ్నలకు సమాధానం తెర వెనుక వ్యాపార సంబంధాలేనా అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది నేతలైతే.. ఇలా ధర్నాలు, ఆందోళనలకు వెళితే.. సొంత పార్టీ నేతలని కూడా చూడకుండా కేసులు పెడతారని.. కాబట్టి మళ్లీ అవసరమా అని గమ్ముగా ఉన్నారనే మాట కూడా వినిపిస్తోంది.

దీనిపై ఇప్పుడు ఆయా నేతలంతా ఎవరి కారణాలు వాళ్లు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఒకరు జ్వరమంటుంటే..మరొకరేమో.. తాను గుంటూరులో అందుబాటులో లేనంటున్నారట. ఇంకొకరు మాత్రం.. నేను ప్రయాణంలో ఉన్నాను.. నాకు అసలేం జరిగిందో కూడా తెలియదు అని బుకాయిస్తున్నారట. ఎన్నికల ముందు వరకు మా పార్టీ అని గొప్పగా చెప్పుకున్న సీనియర్ నేతలు.. ఇప్పుడు మాత్రం.. నాకెందుకు వచ్చిందిలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు అధినేత దృష్టికి వచ్చింది. తొలిసారి ఎన్నికైన గళ్లా మాధవి, రామాంజనేయులు వంటి బీసీ, ఎస్సీ నేతలు చూపించిన తెగువను సీనియర్లు ఎందుకు చూపించలేదని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Also Read : దమ్ముంటే నిరూపించాలి.. వైసీపీ ఎమ్మెల్సీపై లోకేష్ ఫైర్..!

ఇందుకు కారణాలపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని పార్టీ పెద్దలను లోకేష్ ఆదేశించినట్లు సమాచారం. పెద్దలు నిజాయితీగా నివేదిక ఇస్తే.. వైసీపీ నేతలతో టీడీపీ ఎమ్మెల్యేల తెర వెనుక వ్యాపార సంబంధాలు తప్పకుండా బయటపడతాయనేది పార్టీ కార్యకర్తల మాట. ఏది ఏమైనా, వైసీపీ నేతలతో ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేలు తెర వెనుక అనుబంధాలు, వ్యాపార సంబంధాలు తెంచుకోకుంటే, వారి రాజకీయ భవిష్యత్ అంధకారం కావటం ఖాయం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుర్గమ్మ కోసం ‘అమ్మవారి...

​విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ...

దమ్ముంటే నిరూపించాలి.. వైసీపీ...

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడీగా...

ఇది చంద్రబాబు ఇచ్చే...

గత ఏడాది కాలంగా ఏపీలో తిరువూరు...

లిక్కర్ కేసుపై సుప్రీం...

ఆంధ్రప్రదేశ్ మద్యం కేసు దర్యాప్తులో ఇప్పటికీ...

సెలవు పై ఐఏఎస్...

సీనియర్ ఐఏఎస్ అధికారి కాటమనేని భాస్కర్...

బిల్డప్ అదుర్స్.. బొమ్మ...

అసెంబ్లీకి జగన్.. కూటమిలో వణుకు..! ఈ...

పోల్స్