Wednesday, October 7, 2026 08:38 AM
Wednesday, October 7, 2026 08:38 AM

ఇది చంద్రబాబు ఇచ్చే వార్నింగ్.. కొలికపూడికి పల్లా హెచ్చరిక..!

గత ఏడాది కాలంగా ఏపీలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం హాట్ టాపిక్ గా నడుస్తూనే ఉంది. ఆయన మాట్లాడే మాటలు, చేసే విమర్శలు అన్నీ కూడా ప్రభుత్వ,పార్టీ పెద్దలను కలవరపెడుతునే ఉంటాయి. నాలుగు నెలల నుంచి విజయవాడ ఎంపీ కేసినేని చిన్నితో ఆయన తీవ్ర యుద్దమే చేసారని చెప్పాలి. ఈ అంశంలో పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఎన్ని వార్నింగ్ లు ఇచ్చినా సరే పల్లా మాత్రం వెనక్కు తగ్గలేదు. అటు సస్పెండ్ చేయాలనే డిమాండ్ లు కూడా వినిపించాయి.

Also Read : ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్.. ఏం మాట్లాడతారో వింటా..!

అటు తిరువూరు నియోజకవర్గ మండల అధ్యక్షులతో కొలికపూడికి విభేదాలు తీవ్రం అయ్యాయి. ఇక మాజీ మంత్రి జవహర్ తో కూడా విభేదాలు నడిచాయి అనే మాట వినపడింది. ఈ తరుణంలో తాజాగా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు.. అసెంబ్లీలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అసెంబ్లీ లాబీలో తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడితో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా భేటీ అయ్యారు. సీఎం చంద్రబాబు ఆదేశాలుగా కొలికిపూడికి తీవ్ర హెచ్చరికలు జారీ చేసారు పల్లా శ్రీనివాస్. పరిణామాలను కూడా ఆయనకు వివరించారు.

Also Read : లిక్కర్ కేసుపై సుప్రీం సంచలన కామెంట్స్..!

పార్టీ క్రమశిక్షణ దాటి ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకునేందుకు సీఎం చంద్రబాబు సిద్ధంగా లేరన్న పల్లా.. ఏ కఠిన నిర్ణయం తీసుకున్నా సరే బాధ్యత వహించాలని వార్నింగ్ ఇచ్చారు. అనుభవరాహిత్యంతోనే పొరపాట్లు జరుగుతున్నాయని ఎమ్మెల్యే కొలికిపూడి వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. సీనియర్లు తనకు మార్గనిర్దేశం చేయాలని కోరిన ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు.. బహిరంగ వ్యాఖ్యలు చేయనని చెప్పినట్లు సమాచారం. దీనిపై స్పందించిన పల్లా.. మౌనాన్ని చేతకానితనం అనుకోవద్దని హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఏపీలో తాగునీటి విప్లవం.....

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాలకు సురక్షితమైన తాగునీటిని...

ఆంధ్రప్రదేశ్‌లో పాక్ స్పై...

పాకిస్తాన్ తో గూఢచర్య కుట్రను...

భారత క్రికెట్ లో...

భారత మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యంత...

చంద్రబాబు ఢిల్లీ టూర్...

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కేంద్ర...

విజయనగరం టీడీపీలో విచిత్ర...

విజయనగరం జిల్లా రాజకీయాలు ఇప్పుడు అత్యంత...

అమరావతిలో కేటీఆర్ టీమ్‌...

ఒకవైపు అమరావతిని భ్రమరావతి, గ్రాఫిక్స్ రాజధాని...

పోల్స్