Wednesday, May 20, 2026 01:49 PM
Wednesday, May 20, 2026 01:49 PM

ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్.. ఏం మాట్లాడతారో వింటా..!

ఏపీ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్దమైంది. అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి వరకు నిర్వహించాలనే దానిపై సభాపతి అధ్యక్షతన నేడు బీఏసి సమావేశం జరగగా వచ్చే నెల 7 వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అవసరమైతే సమావేశాలు పొడిగించాలని నిర్ణయం తీసుకుంది సర్కార్. మొత్తం 17 పనిదినాలు కొనసాగనున్నాయి అసెంబ్లీ సమావేశాలు. ఈనెల 14న బడ్జెట్ ప్రవేశ పెడతారు. ఆ తర్వాత 17, 18 తేదీల్లో బడ్జెట్ పై చర్చ జరగనుంది. ఇక సమావేశం అనంతరం సిఎం చంద్రబాబు మాట్లాడారు.

Also Read : పదవుల ఆరాటమే.. విమర్శలు ఎక్కడ..? కూటమితో ఏపీ బిజేపి మైండ్ గేమ్..?

వ్యక్తిగత కక్షల ప్రస్తావనలకు అసెంబ్లీని వేదిక చేసుకోవద్దు అంటూ చంద్రబాబు స్పష్టం చేసారు. 20 నెలలుగా కూటమి నేతల ఐక్యత కొనసాగుతోంది.. ఇదే ఐక్యత కింది స్థాయిలోను కొనసాగాలని, జిల్లా స్థాయిలో మూడు పార్టీల సమావేశాలు పెట్టుకుంటూ ఐక్యత పెంచుకోవాలి.. పనితీరుపై ఈ సమావేశాల సమయంలో ఎమ్మెల్యేలతో మాట్లాడతానని స్పష్టం చేసారు. 40 మంది ఎమ్మెల్యేలను వ్యక్తిగతంగా పిలిపించుకొని మాట్లాడతా.. ఆవు కథలు చెప్పడం మాని సబ్జెక్టు ప్రిపేర్ అయ్యి సభకు రావాలని సూచించారు.

Also Read : రంగంలోకి బన్నీ.. ఇక లీగల్ ఫైట్

ఎవరేమీ మాట్లాడుతున్నారో నేను నోట్ చేసుకుంటా.. ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రతి ఒక్కరు అసెంబ్లీలో ఉండాలని చంద్రబాబు ఆదేశించారు. నేను కూడా రోజు ఉదయం 11 గంటల నుంచి సెషన్ అయ్యే వరకు అసెంబ్లీలో ఉంటా అంటూ ప్రకటించారు. క్వాంటం వాడకం నాకు తెలియకపోయినా దాని ప్రయోజనాలు బాగా తెలుసన్నారు సిఎం. కాలానుగుణంగా వచ్చే మార్పులకు మనము సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సభ్యులకు స్పష్టం చేసారు. 1.60 లక్షల మంది క్వాంటం కోర్సులకు దరఖాస్తు చేసుకున్నారన్నారు చంద్రబాబు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

టీ బీజేపీలో భారీ...

తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన బండి...

కేంద్రానికి విజయ్ బిగ్...

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ...

ముందస్తు ఎన్నికలకు రెడీ...

తమిళనాడు రాజకీయాలు మరోసారి సంచలనంగా మారాయి....

ముంబై హైకోర్ట్ లాయర్...

దేశంలో మహిళల భద్రతపై ఇటీవలి కాలంలో...

నీట్‌ పరీక్షపై కేంద్రం...

నీట్ యూజీ 2026 పేపర్ లీక్‌పై...

అవును.. వాళ్లిద్దరు కలిశారు.....

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు.. అలాగని.....

పోల్స్