Wednesday, February 11, 2026 06:55 PM
Wednesday, February 11, 2026 06:55 PM

వైసీపీలో నేతల మధ్య ఆధిపత్య పోరు..!

వైసీపీలో ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరుకుంది. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఈ పరిస్థితి మరీ దారుణంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేగా గెలిస్తే మా పై నీ పెత్తనం ఏమిటని కొందరు అంటుంటే.. అసలు ఈ నియోజకవర్గంలో నువ్వెందుకు ఉన్నావని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. పైకి మాత్రం గెలిచేది మేమే.. వచ్చేది మేమే.. అని గొప్పలు చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. చాలా నియోజకవర్గాల్లో గ్రూప్ రాజకీయాలు వైసీపీ అగ్రనేతలకు తలనొప్పిగా మారాయి.

గత ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో నేతలను వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మార్చేశారు. కొంతమంది సిట్టింగ్ నేతలను చివరి నిమిషంలో మార్చగా.. మరికొందరికి మాత్రం ఎన్నికలకు ఆరు నెలల ముందే ట్రాన్స్‌ఫర్ లెటర్ చేతుల్లో పెట్టారు. ఇలా ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి ట్రాన్స్‌ఫర్ అయిన నేతలు.. తిరిగి తమ సొంత నియోజకవర్గంలో చక్రం తిప్పేందుకు ప్రయత్నం చేస్తుండగా.. బదిలీపై వచ్చిన వాళ్లు మాత్రం.. నీకేం పని ఇక్కడ అని బెదిరిస్తున్నారు. మార్కాపురం జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ అభ్యర్థులను వైసీపీ అధినేత మార్చేశారు. మార్కాపురం ఎమ్మెల్యే కె.నాగార్జున రెడ్డిని గిద్దలూరుకు, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును మార్కాపురం, కనిగిరి ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్‌ను కందుకూరు, యర్రగొండపాలెం ఎమ్మెల్యే, మంత్రి ఆదిమూలపు సురేష్‌ను కొండపికి బదిలీ చేశారు.

Also Read : మీకు దండం.. భారత్ తో ఆడండి.. బంగ్లాదేశ్ షాకింగ్ రిక్వెస్ట్..!

ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందగా.. యర్రగొండపాలెంలో మాత్రమే వైసీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్నికల తర్వాత నుంచి నాలుగు నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. మార్కాపురం నియోజకవర్గం నాదంటే నాదని కుందూరు, అన్నా వర్గాలు సిగపట్లు పట్టుకుంటున్నాయి. 2029 ఎన్నికల్లో మార్కాపురంలో నేనే పోటీ చేస్తానంటూ ఇద్దరు నేతలు తమ తమ క్యాడర్‌కు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. దీంతో అసలు తాము ఎవరి వైపు ఉండాలని వైసీపీ నేతలు, కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు.

ఇక మాజీ మంత్రి ఆదిమూలు సురేష్ యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి ఇప్పటికే రెండుసార్లు గెలిచారు. 2009లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన సురేష్.. 2014లో వైసీపీ తరఫున సంతనూతలపాడు నుంచి పోటీ చేసి గెలిచారు. మళ్లీ 2019లో యర్రగొండపాలెం నుంచి పోటీ చేసి గెలిచిన సురేష్.. జగన్ మంత్రివర్గంలో ఐదేళ్ల పాటు మంత్రిగా కొనసాగారు. అయితే నాలుగోసారి కూడా సురేష్‌కు మార్పు తప్పలేదు. ఈ సారి కొండపికి పంపారు జగన్. అయితే గత ఎన్నికల్లో ఓడిన సురేష్.. తిరిగి తన సొంత నియోజకవర్గం యర్రగొండపాలెంలో తన బలం పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంపై సిట్టింగ్ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు వై పాలెం నియోజకవర్గంలో ఆయనకేం పని అంటూ తన సన్నిహితుల వద్ద ఘాటు వ్యాఖ్యలు చేశారు. సొంతూరు మార్కాపురం, పోటీ చేసి ఓడింది కొండపి.. మరి వై పాలెంలో సురేష్‌కు ఏం పని.. అని ఇటీవల వైసీపీ పెద్దలకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

Also Read : పదవుల ఆరాటమే.. విమర్శలు ఎక్కడ..? కూటమితో ఏపీ బిజేపి మైండ్ గేమ్..?

ఇప్పటికే యర్రగొండపాలెం నియోజకవర్గంలో అధికారులు తన మాట అస్సలు లెక్క చేయటం లేదని.. సురేష్ జోక్యంతో సొంత పార్టీ నేతలు కూడా కనీసం తనను పట్టించుకోవటం లేదని చంద్రశేఖర్ ఆవేదన చెందుతున్నారు. ఓ వైపు సురేష్ మాత్రం.. తాను మళ్లీ యర్రగొండపాలెం నుంచే పోటీ చేస్తా అని తన వర్గం నేతల వద్ద పదే పదే చెబుతున్నారట. యర్రగొండపాలెం నియోజకవర్గం పరిధిలోని మండలస్థాయి నేతలతో ఇటీవల మార్కాపురంలోని తన గెస్ట్‌హౌస్‌లో సమావేశమైనట్లు సమాచారం. మీకేం కావాలన్నా నేనున్నా.. నేనే మళ్లీ పోటీ చేస్తా.. మంత్రి అవుతా.. అని ఇప్పటి నుంచే నేతలకు భరోసా ఇస్తున్నారట ఆదిమూలపు సురేష్. ఈ సమావేశం అటు నియోజకవర్గంలో, ఇటు పార్టీ క్యాడర్‌లో తీవ్ర గందరగోళానికి తెర లేపింది. నేతల మధ్య ఆధిపత్య పోరు.. కార్యకర్తలకు తలనొప్పిగా మారింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ డిన్నర్ మీట్.....

రాజకీయాల్లో నిలబడాలి అంటే.. ఎప్పటికప్పుడు సరికొత్తగా...

మ్యాచ్ అంటే ఇది.....

టి20 వరల్డ్ కప్ లో చిన్న...

ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్.....

ఏపీ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్దమైంది....

జగన్ కు చెన్నకేశవ...

రాజకీయాల్లో వైఎస్ జగన్ ది విలక్షణ...

స్పీకర్ సంచలన నిర్ణయం..?...

ప్రజా సమస్యల పరిష్కారానికి చట్ట సభలు...

పదవుల ఆరాటమే.. విమర్శలు...

2014 నుంచి 2019 వరకు ఏపీలో...

పోల్స్