Tuesday, February 10, 2026 08:24 PM
Tuesday, February 10, 2026 08:24 PM

ఇవేం గ్రేడ్ లు..? క్రికెట్ ను కామెడి షో చేస్తున్నారా..?

గత రెండేళ్ళ నుంచి భారత క్రికెట్ లో జరుగుతోన్న పరిణామాలు కామెడి గానే ఉన్నాయి. అంతర్జాతీయంగా భారత జట్టుకు, క్రికెట్ కు ఉన్న ఖ్యాతి కొన్ని చేష్టలతో అది బజారున పడే పరిస్థితి నెలకొన్న మాట వాస్తవం. తాజాగా బోర్డు గ్రేడ్ లను ప్రకటించింది. ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే ఏ గ్రేడ్ లో ఉంచింది. మిగిలిన ఆటగాళ్ళు అందరూ బీ, సిలలో సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. ఇది చూసిన క్రికెట్ అభిమానులు షాక్ అయ్యారు. సాధారణంగా మూడు ఫార్మాట్ లు ఆడే ఆటగాళ్ళు, కీలక ఆటగాళ్లకు ఏ గ్రేడ్ ఇస్తారు.

Also Read : పసి కూనలు కాదు.. డైనమైట్స్..!

తాజాగా ప్రకటించిన గ్రేడ్ లలో ఏ కేటగిరిలో శుభమన్ గిల్, బూమ్రా, రవీంద్ర జడేజాలకు చోటు కల్పించారు. శుభమన్ గిల్ టి20 లలో సమర్ధుడు కాదు.. రెండు ఫార్మాట్ లలో అతను ఇంకా నిరూపించుకోవాల్సి ఉంది. కానీ అతనికి ఏ గ్రేడ్ ఇచ్చేసారు. రెండు ఫార్మాట్ లు మాత్రమే ఆడే జడేజాను ఏ గ్రేడ్ లో కొనసాగించారు. అతని ప్రదర్శన నానాటికి దారుణంగా ఉంది. అయినా సరే ఏ గ్రేడ్ లో ఉంచారు. బూమ్రా కూడా ఏ గ్రేడ్ లో సమర్ధుడు కాదు. ఒక సీరీస్ కు ఉంటే మరో సీరీస్ కు దూరమవుతున్నాడు ఈ బౌలర్.

Also Read : ప్రైవేట్ సైన్యం.. ఏ హీరో చేయని సాహసం..!

కెఎల్ రాహుల్, అయ్యర్, పంత్, సిరాజ్ లను బీ గ్రేడ్ లోకి మార్చడం చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. వీళ్ళను కావాలనే రెండు లేదా ఒకటి ఫార్మాట్ లకు పరిమితం చేసి వారి గ్రేడ్ లను తగ్గించారు. సిరాజ్ మూడు ఫార్మాట్ లు ఆడే ఫిట్నెస్ సామర్ధ్యం ఉన్న బౌలర్. హర్షిత్ రానా కోసం అతనిని పక్కన పెట్టారు. ఇక రాహుల్, పంత్, అయ్యర్ లు టి20 లకు సమర్ధులు. అయినా సరే వాళ్లకు ఛాన్స్ లు ఇవ్వడం లేదు. పైగా గ్రేడ్ తగ్గించింది బోర్డు. ఇక భారత జట్టులో కీలకంగా ఉన్న షమీ దేశవాళి క్రికెట్ లో రాణిస్తున్నా సరే అతనికి అవకాశాలు ఇవ్వడం లేదు. పైగా ఇప్పుడు సెంట్రల్ కాంట్రాక్ట్ లో చోటు కల్పించలేదు బోర్డు. దీన్ని చూసి భారత క్రికెట్ ఇంత కామెడి పీస్ అయిపోయిందా అంటూ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పదవుల ఆరాటమే.. విమర్శలు...

2014 నుంచి 2019 వరకు ఏపీలో...

రాజ్యసభ సభ్యులుగా వాళ్లే...

ఏపీలో త్వరలో ఎన్నికల సందడి నెలకొననుంది....

మళ్లీ ఆ రోజే...

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల...

ఏకి పారేస్తున్న నేషనల్...

రాజకీయాలపై మీడియా ప్రభావం ఎక్కువ. ఛాన్స్...

ఆ మాట మాట్లాడవద్దు.....

ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను నెలల...

రూ.750 కోట్లు డిపాజిట్...

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో...

పోల్స్