Wednesday, August 5, 2026 04:37 PM
Wednesday, August 5, 2026 04:37 PM

ట్రంప్ కు మోడీ థాంక్స్.. దారిలోకి తెచ్చుకున్నాడా..?

అగ్ర రాజ్యం అమెరికా.. దశాబ్దాలుగా ప్రపంచం అమెరికా విషయంలో వినే ట్యాగ్ లైన్. ఏ దేశాన్ని ఎలా తన దారిలోకి తెచ్చుకోవాలో ఆ దేశానికి బాగా తెలుసు. ఆ దేశ ప్రయోజనాల కోసం అధ్యక్షులు, అక్కడి కార్పోరేట్ సంస్థల మేలు కోసం రాజకీయ నాయకులు ఎంతకు అయినా తెగిస్తారు అనే మాట అక్షర సత్యం. ఇప్పుడు భారత్ ను కూడా ఇలాగే దారిలోకి తెచ్చుకున్నాడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. అనే మాట వినపడుతోంది. ఉక్రెయిన్ – రష్యాతో యుద్దాన్ని సాకుగా చూపి.. తన ఆయిల్ ను భారత్ కు అమ్మే ప్రయత్నం చేసారు ట్రంప్.

Also Read : టాలీవుడ్ ఫ్యాన్స్ కు కామన్ సెన్స్ మిస్ అవుతుందా..?

సైలెంట్ గా వెనుజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి.. వారి దగ్గరున్న ఆయిల్ నిల్వలను భారత్ కు అమ్మే ప్లాన్ చేసాడు. దీనికి టారిఫ్ ల అస్త్రం ప్రయోగించాడు. ఇప్పుడు అది ఫలించి.. రష్యా నుంచి ఆయిల్ నిల్వలను కొనేందుకు భారత్ వెనక్కు తగ్గింది. ఫలితంగా.. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై పరస్పర సుంకాలను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం స్వాగతించారు.

Also Read : పాక్ వక్రబుద్ధి.. ఐసీసీ షాక్ తప్పదా..?

ఇది రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, సహకారానికి ఒక గణనీయ ప్రోత్సాహంగా అభివర్ణించారు. ట్రంప్ సోషల్ మీడియాలో సుంకాల తగ్గింపును ప్రకటించిన కొద్దిసేపటికే ప్రధానమంత్రి రియాక్ట్ అయ్యారు. ట్రంప్.. అంతకుముందు మోడీతో మాట్లాడినట్లు ధృవీకరించారు. ఈ చర్యల ఫలితంగా.. భారత ఎగుమతులపై విధించిన సుంకాలు తగ్గుతాయి. రష్యా నుంచి ఆయిల్ కొనే విషయంలో భారత్ వెనక్కు తగ్గింది. వెనుజులా, అమెరికా ఆయిల్ ను భారత్ కొంటుంది అంటూ ప్రకటించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

జంతర్ మంతర్ నిరసనల్లో...

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్...

బీసీలకు ఏపీ సర్కార్...

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతుల సామాజికవర్గాల భద్రత,...

కృష్ణా నదిని మింగేస్తున్నారా..?...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కృష్ణానది...

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

పోల్స్