Wednesday, August 5, 2026 11:51 AM
Wednesday, August 5, 2026 11:51 AM

మద్యం వద్దంటున్న జెన్ జీ.. కారణం ఏంటీ..?

ఒకానొక సమయంలో మద్యపానం అనేది ప్యాషన్ గా చూసే వారు యువత. ఏదైనా అకేషన్ వచ్చినా, లేకపోయినా సరే మద్యం అనేది కామన్ గా మారిపోయిన పరిస్థితి. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి క్రమంగా మారుతోంది. యువత మద్యానికి దూరం కావడానికి ప్రయారిటీ ఇస్తోంది. మద్యపాన అలవాట్లలో తరాల తేడాలను తాజాగా ఓ సర్వేలో బయటపెట్టారు. యునైటెడ్ స్టేట్స్‌ లో గాలప్ పోల్ ప్రకారం, రెండు దశాబ్దాల క్రితంతో పోలిస్తే యువకులు (18-34) తాగడం పూర్తిగా తగ్గిపోయింది.

Also Read : బ్రేకింగ్: విమాన ప్రమాదంలో డిప్యూటి సిఎం మృతి..!

ఇటీవలి సంవత్సరాలలో, 35 ఏళ్లలోపు పెద్దలలో దాదాపు 62% మంది తాగుతున్నట్లు గుర్తించారు. ఇది 2000ల ప్రారంభంలో 72% గా ఉండేది. మిలీనియల్స్ కంటే తలసరి 20% తక్కువ ఆల్కహాల్ తాగుతున్నారని గుర్తించారు. దాదాపు 21.5% మంది అస్సలు మద్యం సేవించడం లేదని, మరో 39% మంది అప్పుడప్పుడు మాత్రమే మద్యం సేవిస్తున్నారని తేలింది. ఆల్కహాల్ భాగస్వామ్యం గత కొన్నేళ్ళలో.. మార్కెట్లలో 66% నుండి 73%కి పెరిగినప్పటికీ, వారు త్రాగే విధానం (ఫ్రీక్వెన్సీ, కేటగిరీ ఎంపిక, వాల్యూమ్‌ ) ఇప్పటికీ అనేక సందర్భాలలో పాత తరాలకు భిన్నంగా ఉంది.

Also Read : ఢిల్లీలో పవన్.. అమిత్ షాతో భేటీపై ఉత్కంట..!

చాలా మంది యువకులు ఇప్పుడు మద్యపానాన్ని నిద్రలేమి, ఆందోళన లేదా హ్యాంగోవర్‌ ల వంటి ప్రతికూల శారీరక ప్రభావాలతో ముడిపెడుతూ దూరమవుతున్నారు. ఆల్కహాల్ లేని, ఫ్లేవర్డ్ లేదా మిశ్రమ పానీయాలు తాగడానికి ఇష్టపడుతున్నారు. కొత్తవిగా భావించే పానీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కెరీర్ పై ఫోకస్ చేయడం, డబ్బుల విలువ తెలియడంతో చాలా మంది మద్యాన్ని దూరం పెడుతున్నారని కూడా గుర్తించారు. సమాజంలో మంచి గుర్తింపు ఉండాలంటే మద్యం కరెక్ట్ కాదనే భావనలో కూడా యువత ఉందట.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

పోల్స్