Wednesday, August 5, 2026 01:13 PM
Wednesday, August 5, 2026 01:13 PM

మా జీవితాలు నాశనం.. బంగ్లా క్రికెటర్ల ఆవేదన..!

అంతర్జాతీయ క్రికెట్ లో భారత్ పాత్ర ఏంటీ అనేది అందరికి ఓ స్పష్టత ఉంది. అందుకే చాలా దేశాలు కయ్యానికి కాలు దువ్వె విషయంలో వెనకడుగు వేస్తూ ఉంటాయి. పాకిస్తాన్ ఎంత చెలరేగిపోయినా భారత్ తో మ్యాచ్ లు ఆడే అవకాశం వస్తే మాత్రం వెనకడుగు వేయదు. ఆర్ధిక కష్టాల నుంచి బయటకు రావడానికి భారత్ తో మ్యాచ్ లే తమకు జీవనాధారం అని భావిస్తూ ఉంటుంది పాక్. కానీ బంగ్లాదేశ్ మాత్రం.. టి20 వరల్డ్ కప్ లో ఆడేది లేదని, భారత్ లో తమ ఆటగాళ్లకు రక్షణ లేదని చెప్పి తప్పుకుంది.

Also Read : ఇదేం పిచ్చి రా అయ్యా..!

దీనిపై ఇప్పుడు బంగ్లాదేశ్ ఆటగాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయానికి ముందు నిర్వహించిన సమీక్షా సమావేశంలో కనీసం తమ అభిప్రాయాలు తీసుకోలేదు అని.. నిర్ణయం తీసుకున్న తర్వాత జరుగుతోన్న పరిణామాలపై అభిప్రాయాలు అడిగారని ఓ క్రికెట్ ఛానల్ తో పలువురు ఆటగాళ్ళు వ్యాఖ్యానించారు. తమ దేశంలో క్రికెట్ కు ఇక భవిష్యత్తు కష్టమే అంటూ ఆవేదన వ్యక్తం చేసారు. అసలు ఈ నిర్ణయానికి తమకు ఏ సంబంధం లేదని కొందరు ఆటగాళ్ళు వ్యాఖ్యానించారు. బోర్డు తమకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు.

Also Read : మరోసారి బయటపడిన జగన్ డబుల్ డైలాగ్..!

ఇది బంగ్లాదేశ్ క్రికెట్ పతనమే అనే విషయం తమకు స్పష్టత ఉందని మరొక క్రికెటర్ వ్యాఖ్యానించాడు. బంగ్లా క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం బుల్బుల్ భరోసా ఇవ్వడానికి ప్రయత్నించాడు, కానీ అది ఆటగాళ్లపై పెద్దగా ప్రభావం చూపలేదని, అంతకు మించి అతను చేసేది ఏం ఉందని క్రిక్ బజ్ తో మాట్లాడుతూ ఓ సీనియర్ ప్లేయర్ అసహనం వ్యక్తం చేసాడు. ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అని, బంగ్లా క్రికెట్ బోర్డు, ఆటగాళ్ళు బొమ్మ అంటూ ఆ క్రికెటర్ వాపోయాడు. మనం వెళ్ళకపోతే మనకే నష్టం, మనది పెద్ద జట్టు కాదని, ఎవరూ పట్టించుకునే పరిస్థితిలో లేరని వ్యాఖ్యానించినట్టు జాతీయ మీడియా పేర్కొంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కృష్ణా నదిని మింగేస్తున్నారా..?...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కృష్ణానది...

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

పోల్స్