Sunday, June 21, 2026 09:42 AM
Sunday, June 21, 2026 09:42 AM

చెవిరెడ్డి : విజయవాడ టూ తీహార్.. వయా మంతెన ఆశ్రమం..!

వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంగతి ఏంటీ..? ఇప్పుడు వైసీపీ కీలక నేతలను, ఆ పార్టీ కార్యకర్తలను వేధిస్తున్న ప్రశ్న ఇది. వైఎస్ జగన్.. ఓదార్పు యాత్ర నుంచి 2024 ఎన్నికల వరకు అన్నీ తానై నిలిచిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు ఆ పార్టీలో చర్చనీయంశంగా మారింది. ఏపీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన చెవిరెడ్డి బెయిల్ కోసం ఎన్నో రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నా సరే ఇప్పటి వరకు ఆయనకు బెయిల్ మాత్రం రాలేదు. ఆయన తర్వాత అరెస్ట్ అయిన ఎందరికో బెయిల్ వచ్చింది.

Also Read : నెయ్యి కల్తీనే.. సిబిఐ సంచలన విషయాలు..!

ఏపీ సర్కార్ సీరియస్ గా తీసుకున్న నకిలీ మద్యం కేసులో కూడా జోగి రమేష్ సోదరులు బెయిల్ పై విడుదల అయ్యారు. చెవిరెడ్డి అరెస్ట్ అయిన కేసులోనే.. జైలుకు వెళ్ళిన రాజంపేట ఎంపీ మిదున్ రెడ్డి కూడా బెయిల్ పై విడుదల అయ్యారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న చెవిరెడ్డి మాత్రం బయటకు రాలేకపోతున్నారు. పార్టీ అధిష్టానం ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా బెయిల్ రాకపోవడంతో ఆ పార్టీలో కేసులు ఉన్న నాయకుల్లో భయం మొదలైంది. అనారోగ్య సమస్యలతో మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమంలో చికిత్సకు కోర్ట్ అనుమతి ఇచ్చింది.

Also Read : బంగారం కొనగలమా..? రాకెట్ కంటే వేగంగా..!

బహుశా చెవిరెడ్డి అరెస్ట్ అయిన తర్వాత పెద్ద ఊరట ఇదే. ఈ కేసులో అటు ఈడీ అధికారులు కూడా ఎంటర్ అయి.. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని, ఎంపీ మిథున్ రెడ్డిని విచారించారు. నగదు వ్యవహారంలో పక్కా ఆధారాలతో చెవిరెడ్డి దొరికిపోవడంతో ఆయనను ఈడీ విచారించడం ఖాయంగా కనపడుతోంది. వచ్చే వారం ఆయనకు నోటీసులు ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఒకవేళ చెవిరెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తే మాత్రం ఆయన బయటకు రావడం కష్టమే అనే మాట కూడా వినపడుతోంది. లిక్కర్ కేసులో ఆయనను తీహార్ జైలుకు తరలించినా సరే ఆశ్చర్యం అవసరం లేదు. ఇప్పుడు ఇదే ఆ పార్టీ నేతలను భయపెడుతోన్న అంశం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

SBI వర్సెస్ తెలంగాణా...

రాయదుర్గం భూముల కేటాయింపు వ్యవహారంలో స్టేట్...

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

పోల్స్