భారత్ – బంగ్లాదేశ్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. వచ్చే నెలలో జరగనున్న టి20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ క్రికెట్ టీం భారత్ లో పర్యటించాల్సి ఉంది. అయితే షేక్ హసీనా భారత్ లో తలదాచుకుంటున్న సమయంలో.. బంగ్లాదేశ్ లో భారత వ్యతిరేక ఉద్యమాలు తీవ్రమయ్యాయి. హిందువులపై కూడా వరుస దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో.. ఐపిఎల్ నుంచి బంగ్లాదేశ్ ఆటగాడిని రిలీజ్ చేయాలని బీసీసీఐ స్పష్టం చేసింది.
Also Read : హిందూపురంలో వైసీపీకి జాకీలు..!
ఇక అప్పటి నుంచి బంగ్లా క్రికెట్ బోర్డు భారత్ ను బెదిరిస్తూ వస్తోంది. తమ ఆటగాళ్లకు భారత్ లో భద్రత లేదని, తాము ఆడే మ్యాచ్ లను.. శ్రీలంకలో నిర్వహించాలని డిమాండ్ చేసింది. దీనిపై ఐసీసీ కి కూడా స్పష్టత ఇచ్చింది. ఇక దీనిపై ఘాటుగా రియాక్ట్ అయిన ఐసీసీ.. బంగ్లాదేశ్ ఆడకపోతే, ఆ స్థానంలో మరో జట్టును తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో జట్టు భారతదేశానికి వెళ్లదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బిసిబి) మరోసారి స్పష్టం చేసింది. బిసిబి అధికారులు, జాతీయ జట్టు క్రికెటర్లు, ప్రభుత్వ క్రీడా సలహాదారుతో జరిగిన కీలకమైన సమావేశం తరువాత కీలక ప్రకటన చేసింది.
Also Read : విజయసాయి రెడ్డి తర్వాత అన్నకే ఈడీ ఆహ్వానం..?
ఈ టోర్నీని బహిష్కరించాలని బంగ్లాదేశ్ జట్టు నిర్ణయం తీసుకుంది. టోర్నీ షెడ్యూల్ ఇప్పటికే ఇచ్చెసాము అని, దీనిని మార్చడం కుదరదు అంటూ టి20 వరల్డ్ కప్ గవర్నింగ్ బాడీ చెప్పడంపై క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ అభ్యంతరం వ్యక్తం చేసారు. బంగ్లాదేశ్ పట్ల ఐసిసి న్యాయంగా వ్యవహరించడంలో విఫలమైందని ఆరోపిస్తూ.. ఈ సమస్య క్రికెట్ కట్టుబాట్లకు మించి ఉందన్నారు. తాము తల వంచేది లేదన్నారు. బంగ్లాదేశ్ ప్రపంచ కప్ ఆడకపోతే దాని అర్థం ఏమిటో అందరూ అర్థం చేసుకోవాలని.. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ మా ఆటగాళ్ల భద్రతను లైట్ తీసుకునేది లేదన్నారు.

