Wednesday, February 4, 2026 10:48 AM
Wednesday, February 4, 2026 10:48 AM

ఈరోజు (19-01-2026) మీ రాశి ఫలితాలు

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్య మాసం, బహుళ పక్షం 19-01-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి…

మేషం 19-01-2026

దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఇంటా బయట అకారణ వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి.

—————————————

వృషభం 19-01-2026

సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపార వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

—————————————

మిధునం 19-01-2026

ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. మిత్రుల నుండి కీలక సమాచారం సేకరిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమౌతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

—————————————

కర్కాటకం 19-01-2026

వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు తప్పవు. వృత్తి ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. నూతన ఋణ ప్రయత్నాలు కలసిరావు. దూర ప్రయాణ సూచనలున్నవి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి.

—————————————

సింహం 19-01-2026

ఉద్యోగమున అధికారులతో సమస్యలు తప్పవు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడతారు. చేపట్టిన పనులు మందగిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.

—————————————

కన్య 19-01-2026

వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలు చేస్తారు. భూ క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

—————————————

తుల 19-01-2026

బంధు మిత్రులతో వివాదాలు పరిష్కారమౌతాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమౌతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి శ్రీకారం చుడతారు. ముఖ్యమైన పనులలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

—————————————

వృశ్చికం 19-01-2026

వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగస్థులకు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. కొన్ని పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. ఆర్థికంగా ఒడిదుడుకులు తప్పవు.

—————————————

ధనస్సు 19-01-2026

కుటుంబ సభ్యులతో ఒక వ్యవహారంలో మాటపట్టింపులు తప్పవు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. నూతన ఋణ ప్రయత్నాలు చెయ్యవలసి వస్తుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.

—————————————

మకరం 19-01-2026

సమాజంలో ప్రముఖుల నుండి సభ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగమున పరిస్థితులు అనుకూలిస్తాయి. సన్నిహితుల సహాయంతో కొన్ని వివాదాలు పరిష్కారమౌతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

—————————————

కుంభం 19-01-2026

నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటా బయట పరిస్థితులు గంధరగోళంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. బంధు మిత్రుల మాటలు మానసికంగా బాధిస్తాయి. ముక్యమైనా పనులలో శ్రమతో గాని పనులు పూర్తి కావు.

—————————————

మీనం 19-01-2026

చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది. కుటుంబ వ్యవహారంలో ఆలోచనలను ఆచరణలో పెడతారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి.

—————————————

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్