Saturday, September 19, 2026 10:19 PM
Saturday, September 19, 2026 10:19 PM

షమీ వచ్చేస్తున్నాడు.. బీసీసిఐ కీలక ప్రకటన..?

భారత క్రికెట్ లో రాజకీయాలు ఈ మధ్య కాలంలో ఆందోళన కలిగిస్తున్నాయి. సీనియర్ ఆటగాళ్ళ విషయంలో అనుసరిస్తోన్న వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తమైంది. ముఖ్యంగా బౌలర్ మహ్మద్ షమీ విషయంలో సెలెక్టర్ లు అనుసరిస్తోన్న వైఖరిని అభిమానులు తీవ్రంగా తప్పుబట్టారు. అతను దేశవాళి క్రికెట్ లో రాణిస్తున్నా సరే అతనిని.. పట్టించుకోవడం లేదనే విమర్శలు వచ్చాయి. ఈ మధ్యలో మరో వార్త కూడా ఫ్యాన్స్ ను కంగారు పెట్టింది. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి అతనిని తప్పిస్తున్నారు అనే ప్రచారం కలవర పెట్టింది.

Also Read : నా పేరు వాడితే.. అంతే సంగతులు..!

అయితే ఇప్పుడు జాతీయ మీడియా ఓ సంచలన కథనం ప్రచురించింది. షమీ జట్టులో చేరుతున్నట్టు బీసీసీఐ అధికారి ఒకరు జాతీయ మీడియాకు వెల్లడించారట. మొహమ్మద్ షమీ గురించి క్రమం తప్పకుండా చర్చలు జరుగుతున్నాయని పేర్కొంది. అతను అంచనాలకు మించి దేశవాళి క్రికెట్ లో రాణిస్తున్నాడు అని ఓ అధికారి చెప్పినట్టు పేర్కొంది. అతని ఫిట్‌నెస్ గురించే ఆందోళన అని.. అతని నైపుణ్యం కలిగిన బౌలర్ గా తెలిపాడు. అతను సెలక్షన్ రాడార్‌కు దూరంగా ఉన్నాడని చెప్పడం తప్పని కొట్టిపారేసాడు.

Also Read : జిల్లా ఏర్పాటు సరే.. మరి వాటి సంగతి..?

న్యూజిలాండ్ వన్డే సిరీస్‌ కు అతనిని ఎంపిక చేయవచ్చు అని చెప్పినట్టు వెల్లడించింది. అతని అనుభవం, కీలక సమయాల్లో వికెట్లు తీసే సత్తా అతనికి ఉందని, 2027 ప్రపంచ కప్ కూడా అతను ఆడటం ఖాయంగా పేర్కొంది. మార్చి లో జరిగిన ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అతను ఆడలేడు. ఆరు మ్యాచ్‌ల్లో 17 వికెట్లు పడగొట్టాడు. పేస్ విభాగంలో ప్రయోగాలు చేస్తుండటంతో షమీ తుది జట్టులోకి రావడం కష్టంగా మారింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పర్యటనలలో అతను లేని లోటు స్పష్టంగా కనపడింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్