Wednesday, August 5, 2026 02:31 PM
Wednesday, August 5, 2026 02:31 PM

బెర్లిన్ లో రాహుల్ బాంబులు.. సంచలన ఆరోపణలు..!

గత కొన్నాళ్ళుగా ఓటు చోరీ అంశాన్ని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తోన్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తాజాగా మరోసారి బాంబులు పేల్చారు. బెర్లిన్ లో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన ఆయన కీలక కామెంట్స్ చేసారు. బిజెపి రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని, అధికార పార్టీపై పోరాటం చేస్తున్న వారిని ఇబ్బంది పెట్టేందుకు.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లను ఉపయోగిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. మా నిఘా సంస్థలు, ఈడీ, సీబీఐలు ఆయుధాలుగా మారాయన్నారు.

Also Read : ఆయనను ఒంటరిని చేసిన కమలనాథులు..!

ఈడీ, సీబీఐల వద్ద బీజేపీపై ఎటువంటి కేసులు లేవు, రాజకీయ కేసుల్లో ఎక్కువ భాగం వారిని వ్యతిరేకించే వారిపైనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. జర్మనీలో ఐదు రోజుల పర్యటనలో ఉన్న రాహుల్.. ఓ వ్యాపారవేత్త కాంగ్రెస్ కు మద్దతు ఇస్తే బెదిరిస్తున్నారని, పని చేయాల్సిన విధంగా దర్యాప్తు సంస్థలు పని చేయడం లేదంటూ మండిపడ్డారు. వాటిని దేశ సంస్థలుగా కంటే సొంత ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన సంస్థలుగా చూస్తున్నారు అంటూ విమర్శించారు రాహుల్. 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి అనుకూలంగా రిగ్గింగ్ జరిగిందని రాహుల్ ఆరోపించారు.

Also Read : తిరుమలలో మరో భారీ స్కామ్.. 50 కిలోల బంగారం మాయం!

భారత దేశ ఎన్నికల వ్యవస్థలో లోపాలు ఉన్నాయని తాము నమ్ముతున్నట్టు రాహుల్ పేర్కొన్నారు. తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో తాము గెలిచామని, ఎన్నికల నిస్పక్షపాతం గురించి తాము పదే పదే సమస్యలను లేవనేత్తుతున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు తాను భారత్ లో మీడియా సమావేశం కూడా నిర్వహించి, ఆధారాలతో విమర్శలు చేసినట్టు పేర్కొన్నారు. హర్యానా ఎన్నికల్లో కూడా తామే గెలుస్తామని, మహారాష్ట్ర ఎన్నికలు నిజాయితీగా జరిగాయని తాము నమ్మడం లేదన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

జంతర్ మంతర్ నిరసనల్లో...

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్...

బీసీలకు ఏపీ సర్కార్...

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతుల సామాజికవర్గాల భద్రత,...

కృష్ణా నదిని మింగేస్తున్నారా..?...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కృష్ణానది...

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

పోల్స్