Sunday, September 20, 2026 02:06 AM
Sunday, September 20, 2026 02:06 AM

అంబటీ నీకో దండం.. బాబు.. ఫైర్ అవుతున్న వైసీపీ నేతలు

వైసీపీ మీడియా సమావేశాలు అనగానే చాలామందికి బూతులు గుర్తుకు వస్తూ ఉంటాయి. సబ్జెక్టు తక్కువ బూతులు ఎక్కువగా వారి ప్రసంగాలు మనం వింటూనే ఉంటాం. మంచి చేసిన సరే దాని గురించి చెడు మాట్లాడే ప్రయత్నం వైసీపీ నేతలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత.. 2019కి ముందు.. 2024 నా అధికారం కోల్పోయిన తర్వాత వైసిపి నేతల వైఖరి ఇలాగే ఉంది. గుంటూరు జిల్లాకు చెందిన అంబటి రాంబాబు ప్రసంగాలు చాలా విడ్డూరంగా ఉంటాయి. వైసీపీలో ఎంత మంది మాట్లాడినా సరే ఈయన శైలి మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఎవరు విన్నా వినకపోయినా అంబటి మాత్రం ప్రెస్ మీట్ పెడుతూనే ఉంటారు.

Also Read : పీవీ మౌన కుమార్.. వంద ప్రశ్నలకు మౌనమే..?

ఇటీవల కాలంలో ఆయన నిర్వహిస్తున్నటువంటి ప్రెస్ మీట్ ల విషయంలో వైసీపీ కార్యకర్తలలో అసంతృప్తి వ్యక్తం అవుతుంది. స్కూల్ విద్యార్థులతో అసెంబ్లీ నిర్వహించిన సమయంలో దానిపై కూడా అంబటి రాంబాబు సెటైర్లు వేసే ప్రయత్నం చేశారు. మీడియా సమావేశంలోనే దీనిపై నాలుక కర్చుకున్నారు అంబటి. ఇక తాజాగా గుంటూరులో శంకర్ విలాస్ ఫ్లై ఓవర్ కు సంబంధించి అంబటి చేసిన విమర్శలపై వైసీపీ నేతలలో అసంతృప్తి వ్యక్తం అయింది. దీనిపై అక్కడి ప్రజల్లో వ్యతిరేకత లేకపోయినా అంబటి మాత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పై విమర్శలు చేశారు.

దీనిపై జిల్లా వైసీపీ నాయకులు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఆ మీడియా సమావేశంలోనే మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి లేచి వెళ్లిపోయారు. ఇక ఆయన వ్యవహార శైలిపై మోదుగుల జిల్లా నేతల వద్ద అసంతృప్తిగా మాట్లాడినట్లు తెలుస్తోంది. అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే అడ్డుకునే ప్రయత్నం చేయడం ఏంటి అని మోదుగుల జిల్లా నేతల వద్ద అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. అటు జిల్లా నేతలు కూడా అంబటి మీడియా సమావేశాల్లో పాల్గొనకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అటు అంబటి రాంబాబు నిరసన కార్యక్రమాలకు వచ్చినా.. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు సైతం ఉన్నాయి.

Also Read : మూతపడుతున్న థియేటర్లు.. కారణాలివే..!

పోలీసులతో సామరస్యంగా వెళ్లవలసిన సందర్భంలో కూడా ఆయన దూకుడు వైఖరి ప్రదర్శించి మీడియాలో హైలెట్ కావాలని ప్రయత్నం చేస్తున్నారని.. ఆ ప్రభావం ఇతర వైసిపి నేతలపై పడుతోందని జిల్లా నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. అటు వైసీపీ అధిష్టానానికి అంబటి పై ఫిర్యాదు చేసినప్పటికీ.. ఆయనకు అధిష్టానం వద్ద కాస్త సపోర్ట్ ఉండటంతో పార్టీ నేతలు ఏం చేయలేక తల పట్టుకుంటున్నారట. సంక్షేమ కార్యక్రమాల విషయంలో కూడా అంబటి రాంబాబు అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారని, దీనివల్ల వైసీపీ కార్యకర్తలు చులకన అవుతున్నారని ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్