Sunday, September 20, 2026 01:17 AM
Sunday, September 20, 2026 01:17 AM

బ్రేకింగ్: టీడీపీలో పదవుల పండుగ

ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. పార్టీ పదవుల విషయంలో గత కొన్నాళ్లుగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పార్టీని.. ప్రజల్లోకి తీసుకువెళ్లే నాయకత్వం కోసం కష్టపడుతోంది. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడిన నాయకత్వాన్ని గుర్తించే దిశగా అధిష్టానం అడుగులు వేస్తోంది. మండల కమిటీల నుంచి నియోజకవర్గాలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీల వరకు వర్కౌట్ చేస్తోంది అధిష్టానం. కార్యకర్తలకు దగ్గరగా ఉండేవాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చే దిశగా పార్టీ అధిష్టానం నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎన్డీఏలోని మిగిలిన పార్టీలతో కూడా కలుపుకొని వెళ్లే నాయకులకు పదవులు రానున్నాయి.

Also Read : మూతపడుతున్న థియేటర్లు.. కారణాలివే..!

కీలకమైన జిల్లా అధ్యక్ష పదవులకు సంబంధించి ఇప్పటికే జాబితా ఖరారు అయిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ నేతలకు అధిష్టానం నుంచి సమాచారం వెళ్ళిపోయింది. తిరుపతి జిల్లా టిడిపి అధ్యక్షురాలుగా పనబాక లక్ష్మిని ఎంపిక చేసింది అధిష్టానం. చిత్తూరు జిల్లా టిడిపి అధ్యక్షుడిగా షణ్ముగంను చంద్రబాబు ఎంపిక చేసినట్లు సమాచారం. పార్టీకి విధేయుడుగా ఈయనకు పేరు ఉంది. అన్నమయ్య జిల్లా టిడిపి అధ్యక్షుడిగా సుగవాసి ప్రసాద్ ఎంపిక ఖరారు అయిపోయింది. ఈయనకు వివాదరహితుడుగా పేరు ఉండటమే కాకుండా కార్యకర్తలకు అందుబాటులో ఉంటారనే పేరు కూడా ఉంది.

Also Read : పరకామణిలో చోరీ చిన్నది కాదు.. ఏపీ హైకోర్టు సంచలన కామెంట్స్ 

ఇక ప్రకాశం జిల్లా టిడిపి అధ్యక్షుడిగా ఉగ్ర నరసింహారెడ్డిని ఎంపిక చేసింది అధిష్టానం. అనంతపురం జిల్లా టిడిపి అధ్యక్షుడిగా మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఎంపికయ్యారు. శ్రీ సత్య సాయి జిల్లా టిడిపి అధ్యక్షుడుగా ఎమ్మెస్ రాజును ఎంపిక చేసింది అధిష్టానం. నంద్యాల జిల్లా టిడిపి అధ్యక్షుడిగా ధర్మవరపు సుబ్బారెడ్డి పేరు దాదాపుగా ఖరారు అయిపోయింది. ఇక విజయనగరం జిల్లా టిడిపి అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున, ఏలూరు జిల్లా టిడిపి అధ్యక్షుడిగా బడేటి చంటి, కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షుడిగా జ్యోతుల నవీన్, బాపట్ల జిల్లా టిడిపి అధ్యక్షుడిగా సలగల రాజశేఖర్ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. అటు జిల్లా కమిటీలకు సంబంధించి కూడా దాదాపుగా నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్