Sunday, September 20, 2026 02:51 AM
Sunday, September 20, 2026 02:51 AM

తిరుమలలో దాతలకు ఎలాంటి సౌకర్యాలుంటాయి..?

తిరుమలలో విరాళం ఇచ్చే దాతలకు టీటీడీ ఎలాంటి సౌకర్యాలు అందిస్తుందనేది చాలా మందిలో ఉన్న అనుమానం. తిరుమల శ్రీవారికి ఎవరైనా, ఎంతైనా కానుక రూపంలో సమర్పించవచ్చు. టీటీడీ పరిధిలో కొనసాగుతున్న ధార్మిక సంస్థలకు ఈ నిధులను ఖర్చు చేస్తారు. అన్న ప్రసాదం, గో శాల, ప్రాణదాన, ఆలయాల నిర్మాణం, వసతుల కల్పన, మౌలిక సదుపాయాల ఏర్పాటు, విద్య, వైద్యం వంటి ఎన్నో కార్యక్రమాలకు ఈ విరాళాలను టీటీడీ ఖర్చు చేస్తుంది. ఇదే సమయంలో విరాళం ఇచ్చిన దాతలకు కూడా టీటీడీ కొన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. దాత విరాళం ఆధారంగా సౌకర్యాలు కల్పిస్తున్నారు.

Also Read : గ్రామాల్లో కమలానికి దిక్కు ఎవరు

తిరుమల శ్రీవారికి ఇచ్చే కానుక లక్ష రూపాయల నుండి మొదలవుతుంది. కొంతమంది భక్తులు తమ తాహతుకు తగినట్లుగా విరాళం అందిస్తారు. కొందరు వస్తు రూపంలో, మరికొందరు బంగారు కానుకల రూపంలో, ఇంకొందరు స్థిరాస్థి రూపంలో కూడా విరాళం ఇస్తారు.

తిరుమలలో లక్ష నుంచి 5 లక్షల రూపాయల విరాళం ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం ఒకరోజున 5 మందికి సుపథం దర్శనం కల్పిస్తారు. ఒక రోజు రూ.100 రూమ్ ఇస్తారు . 6 చిన్న లడ్డులు, ఒక దుప్పట, ఒక బ్లౌజ్ పీస్ కానుకగా ఇస్తారు.

తిరుమలలో 5 నుంచి 10 లక్షల రూపాయల విరాళం ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం 3 రోజులు 5 మందికి సుపథం దర్శనం కల్పిస్తారు. 3 రోజులు రూ.100 గది కేటాయిస్తారు. 10 చిన్న లడ్డులు, ఒక మహా ప్రసాదం, ఒక దుప్పట, ఒక బ్లౌజ్ పీస్ కానుకగా ఇస్తారు.

తిరుమలలో 10 నుంచి 25 లక్షల రూపాయల విరాళం ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం 3 రోజులు 5 మందికి బ్రేక్ దర్శన అవకాశం కల్పిస్తారు. 3 రోజులు రూ.500 రూమ్ ఇస్తారు . 20 చిన్న లడ్డులు, 10 మహాప్రసాదాలు, ఒక దుప్పట, ఒక బ్లౌజ్ పీస్ అందిస్తారు. వీటితో పాటు 50 గ్రాముల బరువైన శ్రీవారి వెండి నాణెం కూడా ఇస్తారు.

Also Read : మంత్రి లోకేష్‌కు ఆ విషయంలో ఇబ్బందులు..!

తిరుమలలో 25 నుంచి 50 లక్షల రూపాయల విరాళం ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం ఒక రోజు సుపథం దర్శనం, 3 రోజులు 5 మందికి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. 3 రోజులు రూ.1,500 రూమ్ ఇస్తారు . 4 పెద్ద లడ్డులు, 5 చిన్న లడ్డులు, 10 మహాప్రసాదాలు, ఒక దుప్పట, ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు. వీటితో పాటు 5 గ్రాముల బరువైన ఒక గోల్డ్ డాలర్, 50 గ్రాముల బరువైన ఒక సిల్వర్ కాయిన్‌ను భక్తులకు కానుకగా ఇస్తారు.

తిరుమలలో 50 నుంచి 75 లక్షల రూపాయలు కానుకగా ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం ఒక రోజు సుప్రభాత సేవ, 2 రోజులు సుపథం దర్శనం, 3 రోజులు 5 మందికి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. 3 రోజులు రూ.2000 గదిని కేటాయిస్తారు. అలాగే 6 పెద్ద లడ్డులు, 10 చిన్న లడ్డులు, 10 మహాప్రసాదాలు, ఒక దుప్పట, ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు. అలాగే 5 గ్రాముల బరువైన ఒక గోల్డ్ డాలర్, 50 గ్రాముల బరువైన ఒక సిల్వర్ కాయిన్ ఇస్తారు.

Also Read : గరం గరం గన్నవరం..!

తిరుమలలో 75 లక్షల నుంచి కోటి రూపాయలు విరాళం ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం 2 రోజులు సుప్రభాత సేవ, 3 రోజులు సుపథం దర్శనం, 3 రోజులు 5 మందికి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. 3 రోజులు రూ.2500 రూమ్ ఇస్తారు . 8 పెద్ద లడ్డులు, 15 చిన్న లడ్డులు, 10 మహాప్రసాదాలు, ఒక దుప్పట, ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు. అలాగే 5 గ్రాముల బరువైన ఒక గోల్డ్ డాలర్, 50 గ్రాముల బరువైన ఒక సిల్వర్ కాయిన్ ఇస్తారు.

తిరుమలలో కోటి రూపాయల పైన విరాళం ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం 3 రోజులు సుప్రభాత సేవ, 4 రోజులు సుపథం దర్శనం, 3 రోజులు 5 మందికి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. 3 రోజులు రూ.3000 రూమ్ ఇస్తారు . 10 పెద్ద లడ్డులు, 20 చిన్న లడ్డులు, 10 మహాప్రసాదాలు, ఒక దుప్పట, ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు. అలాగే 5 గ్రాముల బరువైన ఒక గోల్డ్ డాలర్, 50 గ్రాముల బరువైన ఒక సిల్వర్ కాయిన్ ఇస్తారు. అలాగే వేద పండితులతో రంగనాయక మండపంలో వేద ఆశీర్వచనం ఉంటుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్