Wednesday, August 5, 2026 07:37 AM
Wednesday, August 5, 2026 07:37 AM

అధికారులను హడలెత్తిస్తున్న బీఆర్ నాయుడు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రతిష్టాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది. 2019 నుంచి 2024 వరకు తిరుమల పై అనేక విమర్శలు వచ్చాయి. పాలకమండలి నిర్ణయాల కారణంగా భక్తులు అనేక సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యి సహా అనేక అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇక భక్తుల సౌకర్యం విషయంలో కూడా విమర్శలు రావడంతో.. రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటుంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఎప్పటికప్పుడు వరుస తనిఖీలతో అధికారులను హడలెత్తిస్తున్నారు.

Also Read : ఈ ఎస్పీ పేరు చెప్తే గంజాయి బ్యాచ్ కు హడల్..!

తాజాగా తిరుమలలో భక్తుల సౌకర్యాలకు సంబంధించి ఆయన స్వయంగా తనిఖీలు నిర్వహించారు. సామాన్య భక్తులు ఉచిత వసతి పొందే పిఏసీలలో తనిఖీలు చేశారు. లాకర్లు, కళ్యాణకట్ట, భోజనశాలను బిఆర్ నాయుడు పరిశీలించారు. సౌకర్యాలపై భక్తులను అడిగే వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన బిఆర్ నాయుడు.. తిరుమల, తిరుపతిలో రోజుకో డిపార్ట్మెంట్ ను తనిఖీ చేస్తున్నామన్నారు. అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని బిఆర్ నాయుడు స్పష్టం చేశారు. తమకు సామాన్య భక్తుల సంతృప్తి ముఖ్యమని, ఆ విషయంలో రాజీ పడేది లేదని తేల్చి చెప్పారు.

Also Read : మంత్రి లోకేష్‌కు ఆ విషయంలో ఇబ్బందులు..!

50 పాయింట్ల అజెండా ఉందని, బోర్డు మీటింగ్ లో వాటన్నింటిపై చర్చిస్తామన్నారు. జనవరి 10 వరకు తిరుమల లోనే ఉంటానని, ఏ సమస్యలు ఉన్నా సరే తన దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. పిఎసి 1, పిఎసి 3, సరిగా లేవని తన దృష్టికి వచ్చిందన్నారు. ధ్వజస్తంభాలకు అవసరమైన చెట్లను పెంచాలని నిర్ణయించామని, దేశంలోనే ఆలయాలకు ధ్వజ స్తంభాలను టీటీడీ అందిస్తుందన్నారు. పలమనేరు దగ్గర 100 ఎకరాల స్థలాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని, భక్తుల ఇబ్బంది పడకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్