Sunday, March 22, 2026 01:33 PM
Sunday, March 22, 2026 01:33 PM

అక్కా బాగున్నావా..? యాక్టివ్ అవుతున్న వంశీ..?

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్.. మళ్ళీ నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారా..? అంటే అవుననే అంటున్నాయి గన్నవరం రాజకీయ వర్గాలు. వంశీ చేసే వ్యాఖ్యలు లేదా ఆయన కొన్ని సందర్భాల్లో ప్రవర్తన పక్కన పెడితే.. సామాన్య ప్రజలను పలకరించే విషయంలో వంశీ ఒక పక్కా మాస్ పొలిటీషియన్ అంటూ ఉంటారు ఆయనతో అనుభవం ఉన్న వాళ్ళు. కానీ వైసీపీలోకి వెళ్ళిన తర్వాత క్రమంగా వంశీ మాట తీరు, ప్రవర్తనలో మార్పు రావడంతో.. గతంలో ఆయన చూపించింది నటన అనే అభిప్రాయం ప్రజల్లో బలపడింది.

Also read : ఛీ ఇలాంటి వారితో రాజకీయమా..? చంద్రబాబు సంచలనం

ప్రస్తుతం వంశీ రాజకీయంగానే కాదు.. వ్యక్తిగతంగా కూడా కష్టాలు పడుతున్నారు. నమ్మిన వాళ్ళు చుట్టూ లేకపోవడం, అండగా ఉంటారనుకున్న అనుచరులు ఒక్కొక్కరు జైలుకు వెళ్ళడంతో ఏం చేయాలో తోచని స్థితిలో మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. టీడీపీ ద్వారా బలమైన రాజకీయ పునాదిని గన్నవరం కేంద్రంగా నిర్మించుకున్న వంశీ మోహన్.. గత 5 ఏళ్ళుగా తాను నిర్మించుకున్న సామ్రాజ్యాన్ని తానే కూల్చుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆ కోటను బలోపేతం చేసుకునేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారట.

Also read : క్రోం వాడద్దు.. ఆపిల్ స్ట్రాంగ్ వార్నింగ్

విజయవాడ రూరల్ మండలంలో వంశీకి వ్యక్తిగత పరిచయాలు ఎక్కువ. ఒక్కో మండలంలో సైలెంట్ గా పర్యటనలు చేస్తున్న వంశీ.. తనతో పరిచయం ఉన్న వాళ్ళతో ఒక్కొక్కరితో మాట్లాడుతున్నారట. అక్క బాగున్నావా..? కాఫీ పెట్టు.. ఏం కూర వండావ్..? అబ్బాయి ఎక్కడ ఉన్నాడు..? అంటూ తన మార్క్ పలకరింపుతో ప్రజల్లోకి వెళ్తున్నారు వంశీ. తాను మళ్ళీ పోటీ చేస్తాను లేదా రాజకీయాల్లో ఆక్టివ్ అవుతాననే విషయం చెప్పకుండా.. పలకరింపుల కార్యక్రమం మొదలుపెట్టారట. 2014లో గన్నవరంలో పోటీకి ముందు వంశీ ఇలాగే నియోజకవర్గంలో తనను తాను బలోపేతం చేసుకున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్