Wednesday, February 4, 2026 12:43 PM
Wednesday, February 4, 2026 12:43 PM

ఏ భార్యకు మద్దతివ్వాలో తెలియక..!

సర్పంచ్ కుర్చీ కోసం గొప్ప ప్లాన్ వేశాడు. మరొకరికి అవకాశం లేకుండా సెట్ చేశాడు. మహిళలకు రిజర్వ్ కావడంతో.. ముందు చూపుతో ఆలోచించాడు. తన ఇద్దరు భార్యలతో నామినేషన్ వేయించాడు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఇక్కడే అసలు సమస్య ఎదురైంది. నామినేషన్ దాఖలు గడువు ముగిసింది. ఇప్పుడు ఏ భార్యతో నామినేషన్ విత్ డ్రా చేయించాలనే విషయంపై తేల్చుకోలేక పోతున్నాడు.

Also Read : టీటీడీని వేధిస్తున్న మరో సమస్య..!

సిద్దిపేట జిల్లా అక్బర్ పేట – భూంపల్లి మండలం జంగపల్లి సర్పంచ్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యింది. ఎప్పటి నుంచో సర్పంచ్ పదవి కోసం ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తి.. ఈ ఛాన్స్ వదులుకోదలుచుకోలేదు. వెంటనే తన ఇద్దరు భార్యలను రంగంలోకి దింపాడు. ముందు మొదటి భార్యతో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయించాడు. ఆ తర్వాత అనుమానం వచ్చింది. నామినేషన్ పత్రాల్లో ఏవైనా తప్పులు ఉంటే.. స్క్రూటినీలో తొలగిస్తే.. ఈ భయంతో రెండో భార్యతో కూడా నామినేషన్ దాఖలు చేయించాడు.

Also Read : చంద్రబాబు ఎందుకు ఈజీ టార్గెట్ అవుతున్నారు?

ఇక్కడే అసలు సమస్య ఎదురైంది. నామినేషన్ల దాఖలు గడువు ముగిసే సమయానికి పోటీలో ఈ ఇద్దరే ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒకరు ఉపసంహరించుకుంటే సర్పంచ్ పదవి ఏకగ్రీవం అవుతుంది. మరి నామినేషన్ విత్ డ్రా చేసుకునేది ఎవరూ అనే విషయం ఇప్పుడు గ్రామంలో ఆసక్తిగా మారింది. మొదటి భార్యకు మద్దతిస్తే.. రెండో ఆమెతో గొడవ.. రెండో ఆమెను కొనసాగమంటే.. ఫస్ట్ భార్యతో తలనొప్పి.. దీంతో ఏ భార్యను సర్పంచ్ చేయాలనే సందిగ్ధంలో భర్త తల పట్టుకున్నాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

పోల్స్