Sunday, June 21, 2026 01:21 AM
Sunday, June 21, 2026 01:21 AM

‘అఖండ 2’ ప్రివ్యూ రిపోర్ట్ : బాలయ్య విశ్వరూపం

బాలకృష్ణ ప్రధాన పాత్రలో, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘అఖండ 2’పై ప్రేక్షకుల్లో ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. డిసెంబర్ 5న విడుదల కానుండడంతో, ఇప్పటికే సెలబ్రిటీల కోసం ప్రివ్యూ షోను ఏర్పాటు చేశారు. ఆ షోను చూసిన వారికి సినిమా ఎలా అనిపించిందనే అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Also Read : ఛీ ఛీ.. అలాంటి సినిమాలకు అవార్డులా..

‘అఖండ’ ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే సీక్వెల్ ప్రారంభమైందని ప్రివ్యూ రిపోర్ట్స్ సూచిస్తున్నాయి. కాశ్మీర్‌లోని పహల్గమ్ ప్రాంతంలో జరిగిన టెర్రరిస్ట్ దాడులు, వాటికి భారత ప్రభుత్వం తీసుకున్న రివెంజ్ చర్యలు కథకు నేపథ్యంగా ఉపయోగించారట. అలాంటి ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు అఘోర రూపంలో ఉన్న బాలయ్య ధర్మరక్షణ కోసం ఏ స్థాయికి వెళ్లాడు? ఇతర దేశాల వరకూ సాగిన ఆ పోరాటంలో ఆయన ఎలాంటి తీర్పునిచ్చాడు?.. ఇవన్నీ కథలో ప్రధాన ఆకర్షణలట. ఈ సినిమాలో బాలయ్య నటన మరోస్థాయిలో ఉందని సెలబ్రిటీలు పేర్కొంటున్నారు.

Also Read : ఫిబ్రవరిలోనే ఎంగేజ్మెంట్..? అప్పుడే హింట్ ఇచ్చిన సమంతా..?

సినిమా ఫస్ట్ హాఫ్‌లో వచ్చే ఇంటర్వెల్ బ్లాక్ తెలుగు సినిమాలో చూడని రేంజ్‌లో ఉందని ప్రివ్యూ చూసిన వారు చెబుతున్నారు. ఇంటర్వెల్ తర్వాత కొద్దిసేపు నెమ్మదించినప్పటికీ, వెంటనే మళ్లీ బాలయ్య స్టైల్ మాస్ ఫైట్ సీన్లు ప్రేక్షకులను ఉర్రూతలూగించేలా ఉన్నాయని అభిప్రాయాలు వస్తున్నాయి. క్లైమాక్స్‌లో కనిపించే ఇద్దరు బాలయ్యల యాక్షన్, ఎమోషన్ కలగలిసిన సన్నివేశాలు హైలైట్ అంటున్నారు. మొత్తానికి ‘అఖండ 2’తో బాలయ్య–బోయపాటి కాంబినేషన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ బావుటా ఎగురవేయనుందా? లేదా? అన్నది రిలీజ్ రోజునే తేలనుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్