Wednesday, February 4, 2026 07:15 PM
Wednesday, February 4, 2026 07:15 PM

ఈరోజు (02-12-2025) మీ రాశి ఫలితాలు

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం 02-12-2025 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి.

మేషం 02-12-2025

ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. సోదరుల సహాయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వివాదాలకు సంభందించి కీలక సమాచారం సేకరిస్తారు.

—————————————

వృషభం 02-12-2025

చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. వృత్తి, వ్యాపారాలలో భాగస్థులతో అకారణ వివాదాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. దైవ దర్శనాలు చేసుకోవడం మంచిది.

—————————————

మిధునం 02-12-2025

నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. ఋణ సమస్యలు నుండి బయటపడతారు. ఆప్తుల సహాయ సహకారాలు అందుతాయి. అవసరానికి చేతికి ధన సహాయం అందుతుంది. నూతన పరిచయాలు ఉత్సాహనిస్తాయి. వ్యాపారాలు గతం కంటే మంచి లాభాలు అందుతాయి.

—————————————

కర్కాటకం 02-12-2025

కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటా బయట కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి, వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.

—————————————

సింహం 02-12-2025

వృత్తి, వ్యాపారాలలో ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. గృహ నిర్మాణం ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులతో పాత విషయాలు చర్చిస్తారు.

—————————————

కన్య 02-12-2025

ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. దైవనుగ్రహంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. గృహంలో శుభకార్య ప్రస్తావన వస్తుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా అభివృద్ధి చెందుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు.

—————————————

తుల 02-12-2025

వ్యాపారస్థులకు ప్రభుత్వ సంభంధిత ఇబ్బందులు కలుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలు మందకోడిగా సాగుతాయి. బంధు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

—————————————

వృశ్చికం 02-12-2025

నూతన వ్యాపార ప్రారంభ పనులు వాయిదా వేస్తారు. అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. వృత్తి, ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి.

—————————————

ధనస్సు 02-12-2025

ఉద్యోగుల శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తిగా సాగుతాయి. సన్నిహితుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు.

—————————————

మకరం 02-12-2025

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు కలసివస్తాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి నిరుద్యోగులు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

—————————————

కుంభం 02-12-2025

ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. చేపట్టిన వ్యవహారాలలో జాప్యం కలుగుతుంది. ఆప్తులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో ఊహించని మార్పులు తప్పవు. వృత్తి, ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది.

 

—————————————

మీనం 02-12-2025

వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. ఋణ దాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. సంతాన ఆరోగ్య విషయాలలో జాగ్రత్త అవసరం ముఖ్యమైన వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. బందు వర్గంతో మతాపట్టింపులుంటాయి.

—————————————

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్