Saturday, September 19, 2026 08:15 PM
Saturday, September 19, 2026 08:15 PM

మావోయిస్టు పోరాటం ఆరోజుతో ముగింపు..!

2026 మార్చి నాటికి భారతదేశం మావోయిస్టు రహిత దేశంగా మారుస్తామని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఇప్పటికే ప్రకటించారు. ఆ దిశగా చర్యలు చేపట్టిన కేంద్ర సర్కార్.. ఆపరేషన్ కగార్ నిర్వహిస్తోంది. సుమారు ఏడాది కాలంగా కేంద్ర బలగాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. ఇప్పటికే వందల మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్లల్లో హతమవుతున్నారు.

Also Read : అది గంభీర్ గొప్ప కాదు.. కడిగి పారేసిన మాజీ క్రికెటర్..!

ఆపరేషన్ కగార్‌లో భాగంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బిహార్, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గడ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాలు విస్తృతంగా కూబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. తాజాగా మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఏపీలోని మారేడుమిల్లి సమీపంలోని దండకారుణ్యంలో ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల, ఆశన్నతో పాటు వేల మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. దీంతో మావోయిస్టు పార్టీ బలహీనమైంది.

Also Read : యూట్యూబ్ లో హనుమాన్ చాలీసా సరికొత్త రికార్డ్

ఆపరేషన్ కగార్ నేపథ్యంలో మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు. ఆయుధాలు విడిచిపెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. దీనిపై మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్.. ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో లేఖ విడుదల చేశారు. జనవరి 1 నుంచి ఆయుధాలు విడిచి జన జీవన స్రవంతిలోకి వచ్చేందుకు తామంతా సిద్ధమని లేఖలో ప్రస్తావించారు. అందరం ఒకేసారి లొంగిపోతామన్నారు. 2026 జనవరి 1 నుంచి సాయుధ పోరాటం పూర్తిగా విరమించుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఆయుధాలు అప్పగించి.. ప్రభుత్వ పునరావాసాన్ని తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. దీనిపై కేంద్రంతో పాటు ఆయా రాష్ట్రాలు సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని లేఖలో అనంత్ విజ్ఞప్తి చేశారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్