Saturday, September 19, 2026 08:17 PM
Saturday, September 19, 2026 08:17 PM

యూట్యూబ్ లో హనుమాన్ చాలీసా సరికొత్త రికార్డ్

గతంలో.. సోషల్ మీడియాలో హిందూ సమాజ వీడియోలకు పెద్దగా గుర్తింపు ఉండేది కాదు. యువత కూడా అంత ఆసక్తిగా చూసే పరిస్థితి ఉండదు. కానీ గత 5 ఏళ్ళుగా పరిస్థితి వేగంగా మారింది. సోషల్ మీడియాలో అప్లోడ్ అవుతోన్న వీడియోలకు మంచి స్పందన వస్తుంది. ఇప్పుడు ఓ వీడియోను ఏకంగా 500 కోట్ల మంది వీక్షించారు. సాధారణంగా ఫేమస్ మ్యూజిక్ స్టార్ లు, సినిమా వాళ్లకు ఈ తరహాలో వ్యూస్ వస్తూ ఉంటాయి. యూత్ ను ఆకట్టుకునే ఇంగ్లీష్ వీడియోలు ఈ రేంజ్ లో ఫేమస్ అవుతూ ఉంటాయి.

Also Read : ఇమ్రాన్ బ్రతికే ఉన్నారా..? పాక్ రక్షణ శాఖ ఏం అంటోంది..?

కానీ హనుమాన్ చాలీసా వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. టీ – సిరీస్ వ్యవస్థాపకుడు దివంగత గుల్షన్ కుమార్ నటించగా.. హరిహరన్ పాడిన శ్రీ హనుమాన్ చాలీసా, 14 ఏళ్ళ క్రితం యూట్యూబ్ లో అప్లోడ్ అయింది. ఇప్పుడు ఈ వీడియో ఇండియాలో ఉన్న అన్ని వీడియోలను డామినేట్ చేసింది. ఈ భక్తి గీతం మే 10, 2011న ఆన్‌లైన్‌ లో అప్లోడ్ అయింది.

Also Read : అది గంభీర్ గొప్ప కాదు.. కడిగి పారేసిన మాజీ క్రికెటర్..!

5,006,713,956 మంది ఈ వీడియోను ఇప్పటి వరకు చూసారు. హరిహరన్ గానం, లలిత్ సేన్ కూర్పు హనుమాన్ చాలీసాకు హైలెట్ గా చెప్పవచ్చు. ఇతర భారత వీడియోలు 2 బిలియన్ల వరకు వీక్షణలు పొందాయి. ఇప్పటివరకు, దేశంలో అత్యధికంగా వీక్షించబడిన వీడియోగా శ్రీ హనుమాన్ చాలీసా నిలిచింది. ఫేస్బుక్ సహా ఇతర మాధ్యమాల్లో కూడా ఈ వీడియో రీల్స్ వైరల్ అవుతూ ఉంటాయి. టీ – సిరీస్ యూట్యూబ్ ఛానల్ 2019 మేలో 100 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌ లు సాధించిన మొదటి వీడియోగా నిలిచింది. ప్రస్తుతం టి-సిరీస్ సబ్‌స్క్రైబర్ లు 307 మిలియన్లు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్