Wednesday, August 5, 2026 10:06 AM
Wednesday, August 5, 2026 10:06 AM

సైఫ్ ఒక్క ప్యాలెస్ విలువ తెలిస్తే మైండ్ బ్లాక్..!

సినీ నటుల ఆస్తుల విలువ చూస్తే కళ్ళు భైర్లు కమ్ముతాయి అనడంలో ఏ సందేహం లేదు. ముఖ్యంగా మన దేశంలో సినీ ప్రముఖుల ఆస్తులు భారీగా ఉన్నాయి. వ్యాపారాలు, స్థిరాస్తులు, విదేశీ ఆస్తులు, కార్లు ఇలా భారీగానే ఆదాయం సమకూర్చారు. ముఖ్యంగా బాలీవుడ్ అగ్ర హీరోలు సైఫ్ అలీ ఖాన్, అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్ వంటి వారికి భారీగా ఆస్తులు ఉన్నాయి. వారిలో సైఫ్ అలీ ఖాన్ ఓ ఆస్తి విలువ చూస్తే షాక్ అవ్వడమే.. అతని ఒక్క ప్యాలెస్ విలువ ఏకంగా 800 కోట్లు.

Also Read : భాగ్యశ్రీ తో ఎఫైర్ పై రామ్ క్లారిటీ..!

హర్యానాలో ఉన్న సైఫ్ అలీ ఖాన్ పూర్వీకుల ఇల్లు పటౌడీ ప్యాలెస్ విలువ రూ. 800 కోట్లు. ఇది షారుఖ్ ఖాన్ మన్నత్, అమితాబ్ బచ్చన్ జల్సా వంటి బాలీవుడ్ బంగ్లాల కంటే చాలా ఖరీదైనదట. హర్యానాలోని పటౌడిలో ఈ ప్యాలెస్ ఉంది. ఢిల్లీ నుండి 80 కి.మీ దూరంలో ఉన్న సంపన్నమైన పటౌడి ప్యాలెస్ విలువతో పోలిస్తే.. ఏ స్టార్ హీరోకు అంత ఖరీదైన భవనం లేదు. ప్రస్తుత పటౌడి నవాబుగా, సైఫ్ అలీ ఖాన్ దాని యజమానిగా ఉన్నారు. పటౌడీ సోదరులు సైఫ్, సోహా, సబా, వారి కుటుంబాలకు వేసవి విడిది నిలయంగా ఉంది.

Also Read : ఇమ్మడి రవి అరెస్ట్ తో సినీ పైరసీ నిజంగానే ఆగుతుందా?

షారుఖ్ ఖాన్ మన్నత్ విలువ దాదాపు రూ.200 కోట్లుగా అంచనా వేయగా, అమితాబ్ బచ్చన్ జల్సా భవనం దాదాపు రూ.120 కోట్లుగా అంచనా వేసారు. సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్ నికర విలువ రూ.80 కోట్లుగా ఉంది. భోపాల్ బేగం సాజిదా సుల్తాన్‌ ను వివాహం చేసుకున్న తర్వాత సైఫ్ తాత ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడీ.. పటౌడీ ప్యాలెస్‌ ను కొనుగోలు చేసారు. 2011లో సైఫ్ తండ్రి మరియు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ మరణం తరువాత, ఈ ఆస్తిని నీమ్రానా హోటల్స్ లీజుకు తీసుకుంది. ఒక ఇంటర్వ్యూలో, సైఫ్ తన పూర్వీకుల ఇంటిని తిరిగి పొందడానికి కోట్ల రూపాయల రుణాలను తిరిగి చెల్లించి, ప్యాలెస్‌ ను తిరిగి కొనుగోలు చేయాల్సి వచ్చిందని తెలిపాడు. యానిమల్ సహా పలు సినిమాల్లో ఈ ప్యాలెస్ ను చూపించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్