Sunday, September 20, 2026 03:16 AM
Sunday, September 20, 2026 03:16 AM

జోగి దందాలు.. సంచలనం దిశగా పోలీసులు..!

వైసిపి మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ పై మరిన్ని కేసులకు రంగం సిద్ధమైందా..? అంటే అవుననే అంటున్నాయి పోలీస్ వర్గాలు. గత కొన్ని రోజులుగా జోగి రమేష్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే నకిలీ మద్యం విషయంలో జోగి రమేష్ అతి జోక్యం ప్రదర్శించి.. ప్రభుత్వంపై నేరుగా విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు టార్గెట్ గా విమర్శలు చేసి కాస్త హైలెట్ అయ్యే ప్రయత్నం చేశారు. ఇబ్రహీంపట్నంలో దొరికిన కల్తీ మద్యం తయారీ కేంద్రం వద్ద వైసీపీ కార్యకర్తలతో కలిసి ఆయన చేయించిన రైడ్ తీవ్ర సంచలనమైంది.

Also Read : జూబ్లీహిల్స్ లో కమ్మ సామాజికవర్గం మద్దతు ఎవరికి?

ఆ తర్వాత నకిలీ మద్యం కేసులో కీలక నిందితుడుగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావును పోలీసులు విచారించగా.. తమతో జోగి రమేష్ మద్యం వ్యాపారం చేయిస్తున్నాడని, మూడు కోట్ల రూపాయలు ఇచ్చి, తానే మద్యం వ్యాపారం పెట్టించి, కావాలని రైడ్ చేశాడని, పోలీసులకు సమాచారం ఇచ్చాడని వెల్లడించారు. ఆ తర్వాత జోగి రమేష్ పై దృష్టి సారించిన పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిని ఉద్దేశించి నారావారి సారా అంటూ మాట్లాడిన రమేష్ వ్యవహారాలపై పోలీసులు దృష్టి సారించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జోగి చేసిన దందాల గురించి ఒక్కొక్కటి బయటకు లాగుతున్నారు.

Also Read : వారిపై చంద్రబాబు, లోకేష్ ఫోకస్..!

ఇప్పటికే నకిలీ మద్యం తయారీ కేసులో అరెస్ట్ అయి నెల్లూరు జైలులో ఉన్న జోగి రమేష్.. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలులో అక్రమాలకు సంబంధించి కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. దీనితో ఈ వ్యవహారంపై కూడా ఆయనపై కేసు నమోదు అయ్యే అవకాశం కనబడుతోంది. అగ్రిగోల్డ్ భూముల అమ్మకాల్లో జోగి రమేష్ ప్రభుత్వం యంత్రాంగాన్ని వాడుకున్నారని కూడా గుర్తించారు. మరోవైపు ఆయన ప్రాతినిధ్యం వహించిన పెడన నియోజకవర్గంలో భూముల క్రయవిక్రయాల్లో కూడా ఆయన పాత్ర పై పలు ఫిర్యాదులు ఉన్నాయి. దీనితో ఈ అంశాల్లో కేసులు నమోదు చేసి జోగి రమేష్ ను విచారించే అవకాశం కనబడుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్