Saturday, September 19, 2026 09:12 PM
Saturday, September 19, 2026 09:12 PM

ఎక్కడున్నా వేటాడతాం.. వైసీపీ సోషల్ మీడియాకు స్ట్రాంగ్ సిగ్నల్

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టిడిపి నాయకులను, జనసేన పార్టీ నాయకులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన పరిస్థితి ఉండేది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ కార్యకర్తలు చేసిన విమర్శలపై ఆందోళన నెలకొన్న పరిస్థితి. టిడిపి మహిళా నాయకులను, చంద్రబాబు కుటుంబ సభ్యులను, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను తీవ్రంగా దూషించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు వారందరిపై పోలీసులు నిఘా పెట్టినట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. ముఖ్యంగా విదేశాల్లో ఉండి పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు గురి పెట్టారు.

Also Read : మైలవరంలో వైసీపీ ఇసుక డాన్.. అంట కాగుతున్న టీడీపీ నేతలు..!

ప్రభుత్వ ఆదేశాలతో… వారు ఎప్పుడు రాష్ట్రానికి వస్తున్నారు, వారితో ఎవరు ఎక్కువగా మాట్లాడుతున్నారు, వారికి సహకరిస్తున్న వారెవరు, వంటి అనేక విషయాలను పోలీసులు ఎప్పటికప్పుడు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ విషయం తాజాగా అరెస్టు అయిన మాలపాటి భాస్కర్ రెడ్డితో స్పష్టత వచ్చింది. తన తండ్రి మరణించాడు అనే విషయం తెలుసుకున్న భాస్కర్ రెడ్డి సైలెంట్ గా వచ్చి వెళ్లే ప్రయత్నం చేశాడు. అతను వస్తున్న సమాచారాన్ని పక్కగా తెలుసుకున్న పోలీసులు అతని కోసం గన్నవరం విమానాశ్రయంలో ఎదురు చూశారు. ఇతనిపై గతంలో తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.

Also Read : తెలంగాణాలో భారీ పెట్టుబడి ప్లాన్.. చివరకు ఏపీకి.. అసలేం జరిగింది..?

టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరిపై అసభ్యకరంగా పోస్టులు పెట్టడమే కాకుండా.. టిడిపి మహిళా నాయకులను అత్యంత అభ్యంతరకరంగా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. అతనిపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా నమోదు అయ్యాయి. ఇలాగే మరికొందరు వైసీపీ కార్యకర్తలపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. రాష్ట్రానికి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్న పరిస్థితి స్పష్టంగా అర్థమవుతోంది. అమెరికాలో ఉండి విమర్శలు చేస్తున్న మరికొంతమందిని కూడా పోలీసులు గుర్తించారు. తమను ఏం చేయలేరు అనే ధీమాలో ఉన్న వారందరికీ తమదైన శైలిలో షాక్ ఇచ్చేందుకు పోలీసులు రెడీ అయ్యారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్