Wednesday, October 14, 2026 08:51 PM
Wednesday, October 14, 2026 08:51 PM

గోవాలో కల్తీ మద్యం.. అద్దేపల్లి లిక్కర్ దందా..!

ఆంధ్రప్రదేశ్ లో కల్తీ మద్యం వ్యవహారంలో తీగ లాగుతున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ములకలచెరువు, ఇబ్రహీంపట్నం మద్యం కేసుల్లో సంచలన అంశాలను గుర్తిస్తున్నారు సిట్ అధికారులు. తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ ను అదుపులోకి తీసుకున్న తర్వాత కీలక పేర్లు వినిపించాయి. ఇక అద్దేపల్లి జనార్ధన రావు నుంచి కీలక సమాచారాన్ని సేకరించారు. తాజాగా ఆరేపల్లి రాము విచారణలో కూడా పలు అంశాలు బయటపడ్డాయి. ఇప్పుడు మరో పేరు వినిపించింది.

Also Read : వాళ్లకు ఫాస్టాగ్ బంద్.. కొత్త రూల్ తెచ్చిన కేంద్రం..!

ఈ మద్యం వ్యాపారాన్ని ఇతర రాష్ట్రాలకు విస్తరించడంలో కొందరు వ్యక్తులు కీలకంగా వ్యవహరించగా.. గోవాకు కూడా ఈ లింకులు ఉన్నట్టు తేల్చారు. ఇప్పటి వరకు తెలంగాణా వరకే ఉన్నట్టు భావించినా.. విచారణలో గోవా నుంచి స్పిరిట్ తెచ్చినట్టు గుర్తించారు. గోవాలో నకిలీ మద్యం డెన్‌ ను సిట్‌ అధికారులు గుర్తించారు. ఈ డెన్ నుంచి తయారు చేసి.. ఉత్తరాది రాష్ట్రాలకు, కర్ణాటకకు తరలించినట్టు కూడా విచారణలో వెల్లడి అయినట్టు సమాచారం. ఈ డెన్‌ లో పలు కీలక వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

Also Read : లిక్కర్ స్కాం లో కొత్త పేరు.. అరెస్ట్ చేస్తారా..?

మద్యం తయారి పరికరాలు, స్పిరిట్‌ లారీలను సిట్ అధికారులు సీజ్ చేసారు. వైసీపీ హయాంలో జనార్ధన్‌ రావుతో కలిసి గోవాలో జినేష్ అనే వ్యక్తి, నకిలీ మద్యం డంప్‌ ఏర్పాటు చేసాడు. సౌత్‌, నార్త్‌ గోవా, పనాజీ, మార్గావ్‌ లో కల్తీ లిక్కర్‌ విక్రయాలు జరిపారు. అలాగే పలు బార్లలో కూడా ఈ కల్తీ విక్రయాలు జరిగాయి. నిందితుడు జినేష్‌ కేరళకు చెందిన వ్యక్తిగా గుర్తించిన సిట్‌.. జినేష్‌ తో పాటు మరో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసింది. మదనపల్లె ఎక్సైజ్‌ ఆఫీసులో జినేష్‌ ను సిట్‌ అధికారులు విచారిస్తున్నారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

వైసీపీలో జగన్ ముందు...

“పార్టీ కోసం నిలబడేది ఎవరు..? పదవుల...

హైదరాబాద్ టీ20 ముంగిట...

భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న...

ఏపీ బ్రాండ్ ఇమేజ్...

నవ్యాంధ్ర రాజధాని అమరావతి, చారిత్రక నగరమైన...

జగన్ కు మ్యూజిక్...

వైఎస్సార్‌సీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్...

రాహుల్ దెబ్బ.. కేంద్రంలో...

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో విపక్ష నాయకుడు...

ఫ్యాక్షన్ గడ్డపై సతీమణుల...

రాయలసీమ రాజకీయాల్లో ఎప్పుడూ అత్యంత వేడి...

పోల్స్