Wednesday, August 5, 2026 10:02 AM
Wednesday, August 5, 2026 10:02 AM

బస్సు బూడిదలో బంగారం కోసం వేట.. కర్నూలులో నివ్వెరపరిచే దృశ్యాలు

ఇటీవల కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. 20 మంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోగా మరి కొంతమంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు. రోడ్డుపై పడి ఉన్న ద్విచక్ర వాహనాన్ని బస్సు వేగంగా ఢీకొనడంతో మంటలు చెలరేగి, క్షణాల్లోనే బస్సు మొత్తం వ్యాపించడంతో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలో ఇప్పటికి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక పోలీసులు కూడా ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేశారు.

Also Read : బ్రేకింగ్: కల్తీ నెయ్యి కేసులో తొలి రాజకీయ అరెస్టు..!

ప్రమాదానికి గల కారణాలేంటి అనేదానిపై దర్యాప్తు బృందాలు ఆరా తీస్తున్నాయి. ఇక ప్రభుత్వాలు ప్రాణాలు కోల్పోయిన వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించాయి. అయితే ఇక్కడ కొంతమంది వ్యవహార శైలి విమర్శలకు దారితీస్తోంది. ఈ బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి బంగారం కోసం కొంతమంది వెతుకులాట ప్రారంభించడం ఆశ్చర్యం కలిగించింది. ఘటన జరిగిన రోజునే పోలీసులు అన్ని పరిశీలించి అక్కడున్న వస్తువులను వేరే ప్రాంతానికి తరలించారు. అయితే కొన్ని మృతదేహాలు కాలిపోయి బూడిద కావడంతో వారు ధరించిన బంగారం వెండి కూడా కరిగిపోయాయి.

Also Read : అయ్యో పాపం.. పరిస్థితి మరీ ఇంత దారుణమా..!

బంగారం ధర ఎక్కువగా ఉండటంతో కొంతమంది మహిళలు ఆ బంగారం కోసం ఆశపడుతున్నారు. దీనితో ఆ బూడిదలో బంగారం వెతకడానికి మహబూబ్నగర్ జిల్లా నుంచి కొంత మంది మహిళలు రావడం గమనార్హం. ఇది చూసిన అక్కడి స్థానికులు విస్తుబోతున్నారు. బూడిదను సంచుల్లో సేకరించి దగ్గర్లోనే ఒక నీటి కుంట వద్ద ఆ బూడిదను కడుగుతున్నారు. ఈ ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపితే.. ఇలా మహిళలు బంగారం కోసం వెతుక్కోవడం మాత్రం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శవాలపై పైసలు ఏరుకోవడం అంటే ఇదే అంటూ చాలామంది సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్