Saturday, October 25, 2025 07:36 PM
Saturday, October 25, 2025 07:36 PM
roots

ఎంపీలు, ఎమ్మెల్యేలకు చుక్కలే.. చంద్రబాబు కీలక నిర్ణయం..!

గత కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ నేతల మధ్య విభేదాలు నెలకొన్న నేపధ్యంలో.. ఇప్పుడు టీడీపీ అధిష్టానం కీలక అడుగులు వేసే అవకాశాలు కనపడుతున్నాయి. కొందరు నాయకులు కావాలనే విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు అనే విమర్శలు సైతం క్రమంగా వినపడుతున్నాయి. ఇటీవల కృష్ణా జిల్లాలో నెలకొన్న పరిస్థితులు పార్టీకి తలనొప్పిగా మారాయి. కార్యకర్తల్లో కూడా కాస్త అసహనం కనపడుతోంది. రాజకీయంగా పార్టీకి సైతం ఇది ఇబ్బందికర పరిణామం చెప్పుకోవచ్చు.

Also Read : ఆ ఇద్దరినీ వదలను.. చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్..?

ఈ నేపధ్యంలో పార్టీ అధిష్టానం.. పార్టీ నేతలపై విచారణ దిశగా అడుగులు వేస్తోంది. పార్టీ కార్యకర్తల అభిప్రాయాన్ని తీసుకునేందుకు రాబిన్ శర్మ టీం ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య విభేదాలు, పార్టీ కార్యకర్తలను విస్మరించే నాయకులు, అవినీతి వ్యవహారాలు, వైసీపీతో స్నేహం, కూటమి నేతలతో ఏ విధంగా ఉంటున్నారు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా లేదా..? సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తున్నారా లేదా..? విపక్షంపై విమర్శలు చేస్తున్నారా లేదా వంటి అంశాలను సర్వేలో తెలుసుకోనున్నారు.

Also Read : దారితప్పిన వారిపై వేటు ఖాయమా.. పార్టీ పెద్దలంటే లెక్క లేదా?

దీనికి సంబంధించి ఇప్పటికే పలు బృందాలు రంగంలోకి కూడా దిగినట్టు వార్తలు వస్తున్నాయి. వారి వ్యాపారాల కారణంగా పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందా లేదా అనే అంశాలను సైతం ఈ విచారణలో తెలుసుకునే అవకాశం ఉంది. నేతల ప్రవర్తన సరిగా లేకుంటే మాత్రం వారి స్థానంలో కొత్త ఇంచార్జ్ ను నియమించి వారిని ప్రోత్సహించే దిశగా కూడా అడుగులు వేస్తున్నట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. వచ్చే వారం దీనికి సంబంధించి కీలక అడుగులు పడనున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

సస్పెండ్ చేస్తే తిరువూరు...

తిరువూరు నియోజకవర్గం టీడీపీలో అలజడి కొనసాగుతోంది....

పులివెందులకు కేంద్రం గుడ్...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

వరల్డ్ కప్‌కు మేం...

గత నాలుగు నెలల నుంచి భారత...

రోహిత్ రికార్డుల మోత.....

భారత క్రికెట్ అభిమానులకు టీమిండియా ఓపెనర్...

ఒక్కొక్కరికి కోటి ఇచ్చే...

బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాతి...

హైడ్రా కమీషనర్ రంగనాథ్...

హైదరాబాద్‌లోని హైడ్రా కమీషనర్ రంగనాథ్ శుక్రవారం...

పోల్స్