Sunday, September 20, 2026 01:52 AM
Sunday, September 20, 2026 01:52 AM

తెలంగాణాలో పింక్ బుక్ లేదు.. సోషల్ మీడియా జాగ్రత్త.. డీజీపీ సంచలన కామెంట్స్

తెలంగాణా నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శివధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసారు. తెలంగాణలో పింక్ బుక్ లేదు, రెడ్ బుక్ లేదు, బ్లూ బుక్ లేదని, మాకు తెలిసిందల్లా ఖాకీ బుక్ మాత్రమే అంటూ ఇంట్రస్టింగ్ కామెంట్ చేసారు. సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు కుటుంబ సభ్యులను కించపరిచేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. డీజీపీ గా నియమించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

Also Read : భారీగా నిధులు ఇవ్వండి.. నిర్మలకు చంద్రబాబు విజ్ఞప్తి

ఏ లక్ష్యంలో నన్ను నియమించారో అందుకు అనుగుణంగా పనిచేస్తామని అన్నారు. లోకల్ బాడీ ఎన్నికలు మాకు మొదటి చాలెంజ్ అని, శాంతియుతంగా ఎన్నికలు పూర్తి చేయడానికి సన్నద్ధం అవుతున్నామని తెలిపారు. పోలీస్ శాఖలో 17000 ఖాళీలు ఉన్నాయి..ఆ నియామకాలు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బేసిక్ పోలీసింగ్ తో సాంకేతికను ఉపయోగించుకుని మరింత సమర్థవంతంగా పని చేస్తామన్నారు. మావోయిస్టులు పొలిట్ బ్యూరో మల్లోజుల వేణు గోపాల్ ఇటీవల ఒక ప్రకటన రిలీజ్ చేశారని, బయటకు రావడానికి, ఆయుదాలు వదిలి పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాం అని ప్రకటన రిలీజ్ చేశారన్నారు.

Also Read : నిర్మాతలను భయపెడుతోన్న స్టార్ జంట..!

జనరల్ సెక్రటరీ బసవరాజు ఉన్నపుడే ఆ నిర్ణయం జరిగిందని వేణుగోపాల్ ప్రకటనలో పేర్కొన్నారని తెలిపారు. వేణుగోపాల్ ఇచిన స్టేట్ మెంట్ జగన్ ఖండించారని, ప్రజా పోరాట పంథా సక్సెస్ అవట్లేదు అని మావోయిస్టులే అంటున్నారన్నారు. పోలీసులు వేధిస్తారనే భయం లేకుండా ఎలాంటి సంశయం లేకుండా మావోయిస్టుల జన జీవన స్రవంతి లోకి రావాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. చాలా మంది ఇప్పటికే పార్టీ నుండి బయటకు వస్తున్నారు..రీసెంట్ సెంట్రల్ కమిటీ మెంబర్ సుజాతక్క కూడా లొంగిపోయారని తెలిపారు. మావోయిస్టుల లతో మాకు ఇక్కడ సమస్య లేనపుడు వాళ్ళతో చర్చలు అనవసరమన్నారు. సైబర్ సెక్యూరిటీ, ఈగల్ టీం లకు పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. మాకు ఉన్నదంతా ఖాకీ బుక్ ..మాకు పింక్ బుక్ గురించి తెలియదన్నారు డీజీపీ.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్