Wednesday, August 5, 2026 02:26 PM
Wednesday, August 5, 2026 02:26 PM

కేంద్రం గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న జీఎస్టీ..?

గత కొన్నాళ్ళుగా జీఎస్టీలో మార్పుల విషయంలో కేంద్ర సర్కార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరుణంలో జాతీయ మీడియా నుంచి ఓ కీలక ప్రకటన వెలువడింది. జిఎస్‌టి లో రెండు శ్లాబులను మాత్రమే కొనసాగించాలని కేంద్రం భావిస్తున్నట్టు వెల్లడించింది నేషనల్ మీడియా. 5 శాతం, 18 శాతం మాత్రమే ఉంటాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపినట్టు జాతీయ మీడియా వెల్లడించింది. ఈ ప్రతిపాదన ప్రకారం, 28 శాతం స్లాబ్‌లోని 90 శాతం వస్తువులను 18 శాతం స్లాబ్‌కు తరలిస్తారు.

Also Read : యువతకు మోడీ గుడ్ న్యూస్.. వాళ్లకు రూ. 15000

అలాగే 12 శాతం స్లాబ్‌లోని 99 శాతం వస్తువులను ఐదు శాతం స్లాబ్‌కు తరలిస్తారని జాతీయ మీడియా వెల్లడించింది. పొగాకు, గుట్కా, సిగరెట్లు వంటి విలాసవంతమైన వస్తువులపై ప్రత్యేక 40 శాతం రేటు వర్తిస్తుంది. ప్రభుత్వ వర్గాల ప్రకారం, 40 శాతం వర్గంలో కేవలం 5-7 వస్తువులు మాత్రమే ఉంటాయి. కానీ రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషనర్, వాషింగ్ మెషిన్ వంటి వస్తువులను మినహాయిస్తారు. పెట్రోలియం ఉత్పత్తులు జీఎస్టీ బయట ఉంటాయి. వజ్రాలు, విలువైన రాళ్ళు వంటి అధిక శ్రమ-ఆధారిత, ఎగుమతి ఆధారిత రంగాలపై ప్రస్తుత రేట్ల ప్రకారం పన్ను విధిస్తారు.

Also Read : మరోసారి తప్పుడు ప్రచారం.. ఈసారి..!

మొత్తం పన్నుల రేటు ప్రస్తుత స్థాయి 88 శాతం వద్దనే ఉంటుంది. జీఎస్టీ ఆదాయంలో 67 శాతం ఆదాయం 18 శాతం శ్లాబ్‌ లోని ఉత్పత్తుల నుండి వస్తుందని, 11 శాతం ఆదాయం 5 శాతం ఉన్న వస్తువుల నుంచి వస్తుందని జాతీయ మీడియా వెల్లడించింది. ఇక ఏడు శాతం ఆదాయం 28 శాతం శ్లాబుల నుంచి వస్తుందని తెలిపింది. ఈ ప్రతిపాదన గనుక అమలు జరిగితే మాత్రం ఖచ్చితంగా చాలా ఉత్పత్తులపై ధరలు తగ్గుతాయని జాతీయ మీడియా వెల్లడించింది. దీనివల్ల సామాన్య ప్రజలతో పాటు మధ్యతరగతి, రైతులు మరియు మహిళలు కూడా నేరుగా ప్రయోజనం పొందుతారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

జంతర్ మంతర్ నిరసనల్లో...

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్...

బీసీలకు ఏపీ సర్కార్...

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతుల సామాజికవర్గాల భద్రత,...

కృష్ణా నదిని మింగేస్తున్నారా..?...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కృష్ణానది...

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

పోల్స్