మావోయిస్టులకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టులకు కంచుకోటలో ఉన్నటువంటి అబూజ్ మడ్ ఏరియాకి చెందిన 22 మంది మావోయిస్టులు రాబిన్షన్ గడియ ఎదుట లొంగిపోయారు. నారాయణపూర్ జిల్లాలో లొంగుబాటు జరిగిన 24 గంటలు గడవక ముందే సుకుమా జిల్లాలో మరో 23 మంది మావోయిస్టులు సుకుమా ఎస్పీ కిరణ్ చాహ్న ఎదుట లొంగిపోయారు.
Also Read : ముందుగా క్యాన్సర్‌ను గుర్తించడం ఎలా? ప్రాణాలను రక్షించే కీలక సమాచారం
ఆపరేషన్ కగార్‌లో భాగంగా మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని కేంద్రం ముమ్మరంగా సాగిస్తోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను కేంద్ర బలగాలు జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టు రహిత దేశం దిశగా అడుగులు వేస్తున్నట్లు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఇప్పటికే ప్రకటించారు. ఇందుకోసం మరిన్ని బలగాలను ఒడిశా, ఛత్తీస్‌ఘడ్, తెలంగాణలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మోహరించారు. ఏడాది కాలంలో 400 మంది పైగా మావోయిస్టులను కేంద్ర బలగాలు మట్టుబెట్టాయి. అలాగే వందల మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.
24 గంటల వ్యవధిలో నారాయణపూర్, సుకుమా జిల్లాలో 47 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరి మీద కోటి 50 లక్షల వరకు రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మావోయిస్టులు పూర్తిగా తమ ఉనికి కోల్పోతున్నారని పోలీసులు వెల్లడించారు. అటవీ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు రవాణా సదుపాయాలు మెరుగు పరుస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. అడవుల్లో ప్రభుత్వాలు చేస్తున్న అభివృద్ధికి మావోయిస్టులకు ప్రజలు సహకరించకపోవడం వల్ల లొంగుబాట్లే శరణ్యమని పోలీసులు ఎదుట లొంగిపోవడం జరుగుతుందన్నారు.
Also Read : అమెరికా వెళ్ళడం ఇంత భారమా..? ఇవేం ఫీజులు ట్రంప్ మామ..?
లొంగిపోయిన వారిలో 9 మంది పీఎల్జీఏ బెటాలియన్ నెంబర్ 1కి చెందిన ముఖ్యమైన మావోయిస్టులు ఉన్నారు. వీరంతా మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులు అయినా హిడ్మా, బర్సే దేవా టీంలో పనిచేశారని సుకుమా ఎస్పీ తెలిపారు. ఛత్తీస్‌ఘడ్ సుకుమా జిల్లా ఎస్ పీ కిరణ్ చాహ్న ఎదుట లొంగిపోయిన 23 మంది మావోయిస్టుల్లో ఒక డీవీసీఎం మెంబర్, పీపీసీఎం మెంబర్లు ఆరుగురు.. ఏసీఎం కమిటీ మెంబర్లు నలుగురు ఉన్నారు. వీరిలో నాలుగు జంటలు మావోయిస్టు దంపతులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరిలో 9 మంది ముఖ్యమైన నాయకులు. వీరంతా గతంలో పలు విధ్వంసకర ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు పోలీసులు వెల్లడించారు. సుకుమా జిల్లా మాజీ కలెక్టర్ అలెక్స్ పాల్ మీనన్‌ను కిడ్నాప్ చేసిన ఘటనలో ప్రముఖ పాత్ర వహించిన మావోయిస్టు లీడర్ లోకేష్ కూడా ఇప్పుడు లొంగిపోయారు.

