Thursday, February 5, 2026 03:47 PM
Thursday, February 5, 2026 03:47 PM

గుడికి వెళ్లక ముందే నిలువు దోపిడి..!

విజ‌యవాడ‌ దుర్గగుడికి వచ్చే భక్తులు దోపిడీకి గురవుతున్నారు. పార్కింగ్ కోసం కాంట్రాక్టు పాడుతున్న వ్యక్తులు ఏకంగా రోడ్డు కూడా ఆక్రమించేశారు. దర్జాగా రోడ్లపై వాహనాలు పార్కింగ్ చేయించి డబ్బులు వసూలు చేస్తున్నారు. అధిక ధరలు వసూలు చేస్తున్నారేంటని అడిగిన భక్తులపై కాంట్రాక్టు సిబ్బంది దాడి చేస్తున్నారు. ఇక స్థానికంగా వన్ టౌన్‌కు పని మీద వచ్చిన వారి నుంచి అయితే ముక్కుపండి మరీ వసూలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా దుర్గగుడి, కార్పోరేషన్, పోలీసు అధికారులు ఏ మాత్రం పట్టించుకోవటం లేదు.

Also Read : బాబోయ్.. నాకేం సంబంధం లేదు..!

రాష్ట్రంలో రెండో అతి పెద్ద ఆలయంగా దుర్గగుడి ప్రసిద్ది. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. శుక్ర, శని, ఆదివారాలు అయితే భక్తుల సంఖ్య రెట్టింపులో ఉంటుంది. దుర్గగుడికి వచ్చే భక్తుల కోసం రాజగోపురం మార్గంలో, ఘాట్ రోడ్డుపై ఓంకారం వద్ద మరో పార్కింగ్‌ను దుర్గగుడి అధికారులు కేటాయించారు. వీటిని ప్రైవేటు వ్యక్తులు వేలం పాటలో దక్కించుకుని నిర్వహిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది.. కానీ దుర్గగుడి కింద రథం సెంటర్ దగ్గర ఉన్న రోడ్డు కూడా పార్కింగ్ కాంట్రాక్టర్లు ఆక్రమించేశారు. రోడ్డుకు ఇరువైపులా కారు పార్కింగ్ చేయించి.. దర్జాగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అదేమని అడిగితే.. ఇది కూడా దుర్గగుడి పార్కింగ్ అని దబాయిస్తున్నారు.

Also Read : ఏపీలో టాపిక్ డైవర్ట్ పాలిటిక్స్..!

విజయవాడ వన్ టౌన్ అంటనే హోల్ సేల్ మార్కెట్‌కు పెట్టింది పేరు. వివిధ ప్రాంతాల నుంచి వ్యాపార లావాదేవీల కోసం ఇక్కడకు వస్తారు. వారితో కూడా ఇక్కడే కార్లు పార్కింగ్ చేయించి, డబ్బులు రెట్టింపులో వసూలు చేస్తున్నారు. ఇక కుటుంబ సభ్యులు, పిల్లలు ఎక్కేందుకు ఆ ప్రాంతంలో ఎవరైనా కారు ఆపినా కూడా వీరికి పార్కింగ్ ఫీజు కట్టాల్సిందే. లేదంటే.. అసలు అక్కడ కారు ఆపకుండా ఎక్కడో దూరంలో పెట్టుకోపో అని హుకుం జారీ చేస్తున్నారు. వృద్దులు, పిల్లలు అక్కడి వరకు వెళ్లి ఎక్కాలంటే నానా పాట్లు పడాల్సిందే. మేం చెప్పినంత కట్టాకే నీ వాహనం ఇక్కడి నుంచి కదులుతుందని భక్తులను బెదిరిస్తున్నారు. ఎవరైనా అదేమని అడిగితే.. నీకు దిక్కున్నచోట చెప్పుకో.. ముందు కారు పార్కింగ్​ ఫీజు కట్టు.. ఎవరికైనా చెప్పుకో అని దాడికి యత్నిస్తున్నారు. దీనిపై అనేక సార్లు ఫిర్యాదులు చేసినా.. దుర్గ గుడి సిబ్బంది, పోలీసులు, కార్పోరేషన్ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. అసలు బ్యారేజ్ నుంచి బస్టాండ్ వైపు వెళ్లే ప్రధాన దారిలో పార్కింగ్‌కు ఎలా అనుమతి ఇచ్చారో సంబంధిత అధికారులే చెప్పాలి. దీనిపై ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోకపోవడంతో.. వారి ఆగడాలను ప్రజలే వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.

దుర్గగుడి పార్కింగ్ కాంట్రాక్టర్లు, అటు కార్పోరేషన్ స్థలాల్లో పార్కింగ్ కాంట్రాక్టర్లు కలిసి ప్రజలను దోచుకుంటున్నా.. వారి ఆగడాలను ఆపే అధికారులే కరువయ్యారు. ఎవరైనా అదేమని అడిగితే చాలు.. మొత్తం సిబ్బంది అంతా కలిసి ఆ వ్యక్తిపై దాడికి తెగబడుతున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా… చోద్యం చూస్తున్న అధికారుల తీరు కారణంగా కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇప్పటికైనా ఈ దోపిడీకి, ఆగడాలకు అడ్డుకట్ట పడేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏ ఒక్కడినీ వదిలిపెట్టం.....

కల్తీ నెయ్యి వ్యవహారం, తిరుమల లడ్డూ...

తెలంగాణకు ఎవరు జాతిపిత..?

తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా...

యాటిట్యూడ్ స్టార్‌.. “గుంజి...

సినిమా అంటే.. నలుగురు చూసేది.. అందులో...

మల్లన్న దగ్గర కూడా...

2019 నుంచి 2024 వరకు ఏపీలో...

వాళ్లను ఎందుకు అరెస్టు...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

పోల్స్