Sunday, June 21, 2026 10:51 AM
Sunday, June 21, 2026 10:51 AM

బిగ్గెస్ట్ సైబర్ అటాక్.. మెయిల్ పాస్వార్డ్ చేంజ్ చేసుకోండి

సైబర్ దాడులు ప్రపంచాన్ని మరోసారి భయపెట్టాయి. ప్రముఖ ఐటీ కంపెనీలు ఈ దెబ్బకు ఒక్కసారిగా షేక్ అయ్యాయి. చరిత్రలో అతిపెద్ద డేటా ఉల్లంఘనలలో ఒకటిగా భావిస్తున్న తాజాగా చోటు చేసుకున్న ఓ ఘటనలో భారీగా డేటా చోరీ అయినట్టు భావిస్తున్నారు. పాస్‌వర్డ్‌ లతో సహా 16 బిలియన్ లాగిన్ డేటా లీక్ అయినట్లు నిర్ధారించారు. ఫోర్బ్స్‌ కథనం ప్రకారం.. ఈ సమాచార లీక్ ప్రభావం.. ఆపిల్, ఫేస్‌బుక్, గూగుల్ గిట్‌హబ్, టెలిగ్రామ్ సహా వివిధ ప్రభుత్వ సేవల వరకు ఏ ఆన్లైన్ లాగిన్ పై అయినా ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించింది.

Also Read :ఏపీలో టాపిక్ డైవర్ట్ పాలిటిక్స్..!

వెబ్ సర్వర్‌లో 184 మిలియన్ రికార్డులను కలిగి ఉన్న అతి క్లిష్టమైన డేటాబేస్ చోరీ అయినట్టు తెలిపింది. ఇది కేవలం చిన్న ట్రయల్ మాత్రమే అని.. భవిష్యత్తులో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని పేర్కొంది. అవుట్‌ లెట్ ప్రకారం, పరిశోధకులు 30 డేటా సెట్‌ లను కనుగొన్నారని, వాటిలో ప్రతి ఒక్కటి 3.5 బిలియన్ల రికార్డులను కలిగి ఉన్నాయని తెలిపింది. సోషల్ మీడియా, వీపీయెన్ లాగిన్‌లతో పాటు కార్పొరేట్, డెవలపర్ ప్లాట్‌ఫారమ్‌లను కలిగి ఉన్న ఈ సమాచారం 2025 ప్రారంభం నుండి చోరీకి గురైనట్టు వెల్లడించారు.

Also Read :అవినీతి అధికారులకు సుప్రీం బిగ్ షాక్.. లంచం కేసులో దొరికితే అంతే..!

ఇది కేవలం లీక్ కాదు. ఇది సామూహిక దోపిడీకి ఒక బ్లూప్రింట్ అంటూ.. ఇది ఒక ఆయుధ రహిత యుద్ధమని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ స్థాయిలో ఆధారాల లీక్‌ లు కావడం.. భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తెచ్చి పెట్టె అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సమాచారం బయటకు రావడంతో గూగుల్ సహా పలు కంపెనీలు.. తమ వినియోగదారులు పాస్వార్డ్ లు అప్డేట్ చేసుకోవాలని వెల్లడించింది. పాస్ కీ తో పాటుగా 2 ఫ్యాక్టర్ వెరిఫికేషన్ పెట్టుకోవాలని సూచించింది. సున్నిత డేటా ఉన్న వాళ్ళు మరింత జాగ్రత్త పడాలని హెచ్చరించింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

SBI వర్సెస్ తెలంగాణా...

రాయదుర్గం భూముల కేటాయింపు వ్యవహారంలో స్టేట్...

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

పోల్స్