Wednesday, May 6, 2026 09:12 PM
Wednesday, May 6, 2026 09:12 PM

జగన్ చేష్టలతో షాక్ లో వైసీపీ

వైసీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా సరే.. ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ చేష్టలు మాత్రం ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి. మాట్లాడే మాటలు చేసే పనులు.. జగన్ స్థాయికి తగ్గట్టుగా ఉండవు అనేది చాలామంది నుంచి వినపడే విమర్శ. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎన్ని విమర్శలు వచ్చినా సరే తాను చేయాలనుకున్నది చేసిన జగన్ ఇప్పుడు ఆ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే విధంగా ప్రవర్తిస్తూ ఆశ్చర్యం కలిగిస్తున్నారు. తాజాగా జగన్ తీసుకున్న ఓ నిర్ణయం వైసిపి కార్యకర్తలను సైతం ఆశ్చర్యపరిచింది.

Also Read : బాబు మంత్రివర్గంలో మార్పులు చేర్పులు..!

ఇటీవల తెనాలిలో గంజాయి బ్యాచ్ ను పోలీసులు తమ పద్ధతిలో ట్రీట్ చేశారు. దీనిపై సోషల్ మీడియాలో ముందు విమర్శలు వచ్చినా.. ఆ తర్వాత వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ తెలిసి పోలీసుల తీరును సమర్థించారు. ఈ విషయంలో పోలీస్ శాఖ కూడా సదరు సిబ్బందికి అండగా నిలబడింది. దీనికి సంబంధించిన వాస్తవాలను బయటపెట్టారు. వాళ్లపై ఒక్కొక్కరిపై తొమ్మిది కేసులు ఉన్నట్టు తేల్చారు. దీనిపై వైసీపీ సోషల్ మీడియా కూడా పెద్దగా విమర్శించలేదు. కానీ దీనికి వైసీపీ నేతలు మద్దతుగా నిలుస్తూ.. దళితులపై దాడి జరిగిందంటూ విమర్శించడం మొదలుపెట్టారు.

Also Read : ఆ కేసులో జగన్ ను పెద్దలు కాపాడతారా..?

ఆ తర్వాత ఈ విషయంలో టిడిపి సోషల్ మీడియా కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయింది. ఇప్పుడు అలాంటి కేసులో ఉన్న వ్యక్తులను జగన్ వెళ్లి కలవాలి.. వారిని పరామర్శించాలి అనుకోవడం ఆశ్చర్యం కలిగించింది. దీనిపై వైసీపీ సోషల్ మీడియా పెదవి విరుస్తుండగా టిడిపి సోషల్ మీడియా దుమ్మెత్తి పోస్తోంది. గంజాయి బ్యాచ్ కు జగన్ అండగా నిలిచారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు టిడిపి కార్యకర్తలు. నేరాలు చేసిన వారిని జగన్ ఏ విధంగా వెనకేసుకొస్తారని మంత్రులు సైతం మీడియా సమావేశాలు నిర్వహించి మండిపడుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్